థియేటర్‌లో రిలీజ్ వద్దంటున్న హీరో.. ఎందుకో తెలుసా?

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

ఈ ఏడాదిలో భీష్మ చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో, ప్రస్తుతం ‘రంగ్ దే’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేశాడు.

పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను కూడా వరుసబెట్టి లైన్‌లో పెడుతున్నాడు ఈ హీరో.

Nithiin Wants Check Movie To Release In OTT, Nithiin, Rang De, Check, OTT, Tolly

విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ‘చెక్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.

కాగా ఈ సినిమాను పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించింది.అయితే ఈ సినిమా ఔట్‌పుట్‌తో నితిన్ సంతోషంగా లేడని తెలుస్తోంది.

Advertisement

దీంతో ఈ సినిమాను థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుంటుందని నితిన్ అభిప్రాయపడుతున్నాడు.ఈ మేరకు చిత్ర నిర్మాతతో చర్చించినిట్లు తెలుస్తోంది.

చెక్’ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడమే ఉత్తమమని నితిన్ సూచించాడట.దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ‘చెక్’ చిత్ర యూనిట్ ప్రయత్నాలు మొదలుపెట్టిందట.

ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్‌లు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తుందా అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా నితిన్ నటిస్తున్న మరో సినిమా ‘రంగ్‌దే’ను అతి త్వరలో థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ సినిమాలో నితిన్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగత తెలిసిందే.మరి చెక్ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.

3 సెకన్లలో మూడు దేశాలలో అడుగు పెట్టిన అమ్మాయి.. ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు