కొత్త ఫోన్ కొన్నాక వెంటనే చేయాల్సిన పనులు ఇవే...!

వేలకు వేలు పోసి కొత్త మొబైల్ ను ఎంతో ఇష్టంగా కొనుక్కుంటారు.

అయితే ఆ తర్వాత మొబైల్ సరిగా పని చేయాలంటే ఏ అంశాలపై దృష్టి పెట్టాలన్న విషయం మాత్రం చాలా మందికి అవగాహన ఉండదు.

అలాంటి కొన్ని విషయాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.మొదటగా మీ కొత్త మొబైల్ తీసుకున్న తర్వాత వెంటనే మీ ఫోన్ కు సంబంధించి పాస్ వర్డ్ ను సెట్ చేసుకోవాలి.

ముందుగా మొబైల్ ఆన్ చేయగానే పాస్ వర్డ్ మేనేజర్ ద్వారా తప్పనిసరిగా మీ ఫోన్ కు పాస్వర్డ్ ఇవ్వమని అడుగుతుంది.అలాంటి సమయంలో మీరు ఖచ్చితంగా పాస్ వర్డ్ పెట్టుకోవడం ఎంతో ఉపయోగకరం.

ఆ తర్వాత కూడా మళ్లీ కావాలి అనుకుంటే మీ పాస్ వ ను పాస్ వర్డ్ మేనేజర్ ద్వారా మార్చుకోవచ్చు కూడా.ఈ పాస్వర్డ్ పెట్టుకోవడం ద్వారా మీ ఫోన్ ను పరాయి వ్యక్తులు మీ సమాచారాన్ని తెలుసుకోకుండా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

Advertisement

ఇక ఆ తర్వాత ప్రతి కొత్త ఫోన్ లోనూ అనేక కొత్త రకాల సదుపాయాలు ఉంటాయి.ఇలా వాటి గురించి పూర్తిగా తెలుసుకొని ఒక దాని తర్వాత ఒకటి పరిశీలిస్తూ వెళితే.

మీకు ఏవైతే అవసరమయ్యే వాటినన్నిటిని ఉపయోగించుకుంటే మీ ఫోన్ ద్వారా కచ్చితంగా పూర్తిస్థాయి ప్రయోజనాన్ని అందుకోవచ్చు.ఇక అలాగే మీరు ఫోన్ సెట్టింగ్ చేసుకునేటప్పుడు కచ్చితంగా కాల్ సంబంధించిన బ్యాక్అప్, అలాగే ఎస్ఎంఎస్ లు, యాప్స్ ఇలా కొన్నింటిని ఆటోమేటిక్ గా బ్యాక్అప్ ఉండేలా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటే అవసరమైనప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇందుకోసం ముందుగానే ఫోన్ ఆన్ చేయగానే ఆండ్రాయిడ్ ఫోన్ సెటప్ చేసే సమయంలో ప్రతి ఒక్క ఫోన్ గూగుల్ అకౌంట్ కాన్ఫిగరేషన్ చేస్తుంది.నిజానికి చాలా మంది వీటి గురించి పూర్తి అవగాహన లేకపోవడంతో అలా వదిలేస్తారు.

ఇలా చేయకుండా కచ్చితంగా గూగుల్ అకౌంట్ కనెక్ట్ చేసి బ్యాకప్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఎప్పుడైనా ఫోన్ రీసెట్ చేయాల్సి వచ్చిన సమయంలో ఈ డేటా కచ్చితంగా ఉపయోగపడుతుంది.ఇకపోతే కొంతమంది కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ఉన్న సమయంలో యాంటీ వైరస్ వేసుకునే విధంగానే మొబైల్ కొన్నప్పుడు కూడా యాంటీ వైరస్ వేయాలని అనుకుంటారు.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !

అయితే ఇలా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.మీ ఫోన్ కి ఆటోమేటిక్ గా గూగుల్ ప్లే స్టోర్ నుండి యాంటీవైరస్ లభిస్తుంది.

Advertisement

గూగుల్ సంస్థ గూగుల్ ప్లే ప్రొటెక్ట్ లాంటి శక్తివంతమైన ప్రొటెక్షన్ మనకు అందిస్తుంది.కాబట్టి మొబైల్ లో ఎటువంటి యాంటీవైరస్ అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

ఇకపై మీరు ఎక్కువగా ఉపయోగించే యాప్స్ ను హోం స్క్రీన్ మీద ఉంచుకోవడంతో.మరలా లోపలకు వెళ్లి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా త్వరగా పని చేసుకోవచ్చు.

కొత్త ఫోన్ కొన్నాము కదా అని, ఫోన్ లో అన్ని రకాల సంబంధించిన యాప్స్ ఉండాలని అవసరం లేకున్నా వాటిని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు.ఇలా చేసుకోవడం ద్వారా మీ ఫోన్ హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అవసరమైన యాప్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్లో ఉంచుకోండి.

తాజా వార్తలు