ఆ దూకుడుకి కారణమిదే : ‘‘బ్రిటన్ రకం’’ గుట్టు విప్పిన లండన్ శాస్త్రవేత్తలు..

2019 ఆఖరిలో చైనాలో పుట్టిన కరోనా వైరస్ నిదానంగా చాప కింద నీరులా ప్రపంచం మొత్తాన్ని కమ్మేసింది.

శాస్త్రవేత్తలు, ఫార్మా సంస్థలు రేయింబవళ్లు కష్టపడి వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి.

ఇంత కష్టపడిన సంబరం ఎక్కువ సేపు నిలబడలేదు.వైరస్ రూపాంతరం చెంది అడ్వాన్స్‌గా మానవాళిపై పంజా విసురుతోంది.

కరోనాకు పుట్టినిల్లు చైనా అయితే.మార్పు చెందిన కోవిడ్ రకాలకు బర్త్ ప్లేస్‌గా యూకే మారుతోంది.

రోజుకొక కొత్త రకం స్ట్రెయిన్‌ బ్రిటన్ గడ్డపై పుట్టుకొస్తుండటంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.ఈ నేపథ్యంలో కోవిడ్‌ వేరియంట్ల వ్యాప్తిని నివారించేందుకు యూకే ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను విధించింది.

Advertisement

కరోనా కొత్త స్ట్రెయిన్ వైరస్ తో జూలై 17వ తేది వరకు లాక్‌డౌన్ పొడిగించాలని బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.యూకేతో పలు దేశాల్లో కొత్త స్ట్రెయిన్ అడుగుపెట్టింది.

పాత రకం కరోనా కంటే ఈ స్ట్రెయిన్ వ్యాప్తిలో, వేగంలో దూకుడు ఎక్కువని తెలిపారు శాస్త్రవేత్తలు.అయితే ఇందుకు కారణాలను వెలికి తీశారు లండన్ శాస్త్రవేత్తలు.

కొత్త స్ట్రెయిన్ ఉద్ధృతంగా వ్యాపించడానికి గల కారణాలను వెలుగులోకి తీసుకొచ్చారు షెఫీల్డ్‌ వర్సిటీ పరిశోధకులు.బి.1.1.7 అనే ఈ రకం కరోనా వైరస్‌ను గతేడాది డిసెంబర్‌లో కెంట్‌లో మొదటిసారి కనుగొన్నారు.ఇందులోని న్యూక్లియోక్యాప్సిడ్‌ జన్యువులో ఒక అదనపు ఉత్పరివర్తనను తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇది వైరస్‌లోని సబ్‌జీనోమిక్‌ ఆర్‌ఎన్‌ఏ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోందని శాస్త్రవేత్తలు వివరించారు.ఫలితంగా మానవ రోగ నిరోధక వ్యవస్థను మరింత సమర్థంగా ఈ వైరస్‌ ఏమారుస్తోందని తెలిపారు.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

బాధితుడి శరీరంలో తన సంఖ్యను భారీగా పెంచుకోవడానికీ వైరస్‌కు ఇది వెసులుబాటు కల్పిస్తోందని పరిశోధకులు చెప్పారు.దీని వల్ల వైరస్ సోకిన రోగీలో వైరల్‌ లోడు అధికంగా ఉండటంతో పాటు వ్యాధి వ్యాప్తి కూడా ఉద్ధృతంగా ఉంటోందని తెలిపారు.వైరస్‌లోని ఓఆర్‌ఎఫ్‌ 9 బీ అనే ప్రొటీన్‌కు సంబంధించిన సూచనలు ఇందులో ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

Advertisement

మానవ రోగ నిరోధక వ్యవస్థను ఈ ప్రొటీన్‌ నియంత్రిస్తుంటుందని పేర్కొన్నారు.యూకే స్ట్రెయిన్‌లో ఓఆర్‌ఎఫ్‌ 9 బీ అధికంగా ఉండటం వల్లే మానవ రోగ నిరోధక వ్యవస్థపై బి.1.1.7 వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతోంది.అందువల్లే ఇతర కరోనా స్ట్రెయిన్‌లతో పోలిస్తే యూకే రకం ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు చెప్పారు.

తాజా వార్తలు