తక్కువ ధరకే హోండా నుంచి కొత్త కమ్యూటర్ బైక్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..

దిగ్గజ 2-వీలర్స్ తయారీదారు హోండా( Honda Motorcycles ) ఇండియాలో సరికొత్త బైక్స్ లాంచ్ చేస్తూ ఆకట్టుకుంటోంది.

తాజాగా CD110 డ్రీమ్ డీలక్స్ 2023 వెర్షన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది.

ఇది కొత్త OBD-II కంప్లైంట్ ఇంజన్, అదిరిపోయే కాస్మోటిక్ చేంజెస్, 10-సంవత్సరాల వారంటీ ప్యాకేజీతో అప్‌డేట్ అయింది.ఈ ఇంజన్ BS-VI ఫేజ్-II కంప్లైంట్ కాగా ఇది 8.67bh పవర్, 9.30 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.ఇది 4-స్పీడ్ మల్టీ-ప్లేట్ వెట్ క్లచ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

కంపెనీ సీడీ110 డ్రీమ్ డీలక్స్‌లో కొత్తగా ఎక్కువ కాంతిని అందించే DC హెడ్‌ల్యాంప్, ఫ్యూయల్ ఆదా చేసే ఇంజన్ స్టార్ట్/స్విచ్ బటన్, సురక్షితంగా బైక్‌ను నిలిపివేసే కాంబి-బ్రేక్ సిస్టమ్‌ను కూడా అందించింది.కాకపోతే ఇందులో LED హెడ్‌లైట్‌లు లేదా DRLs అందించలేదు.

ఈ బైక్ సీటు లెంగ్త్ 720 మి.మీతో ఆ సెగ్మెంట్‌లో అతి పొడవైనదిగా ఉంది.ఇది 18,000 కిమీ వరకు రీప్లేస్‌మెంట్ అవసరం లేని విస్కస్ పేపర్ ఫిల్టర్‌తో వస్తుంది.

Advertisement

CD110 డ్రీమ్ డీలక్స్( CD110 Dream Deluxe ) డిజైన్ చాలా వరకు మారలేదు, అయితే మోటార్‌సైకిల్ ట్యాంక్, సైడ్స్‌లో కొత్త గ్రాఫిక్ ప్రింట్స్ ఉన్నాయి.మఫ్లర్ ఇప్పుడు క్రోమ్ కవర్‌ను కూడా కలిగి ఉంది.

ప్రీవియస్ వెర్షన్లలో లాగానే ఇందులో ఐదు-స్పోక్ అల్లాయ్ వీల్స్ అందించారు.

2023 హోండా CD110 డ్రీమ్ డీలక్స్ ధర రూ.73,400 కాగా ఇది బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ బ్లూ, బ్లాక్ విత్ గ్రీన్, బ్లాక్ విత్ గ్రే వంటి 4 డ్యూయల్ టోన్ కలర్స్‌లో లభిస్తుంది.ఈ బైక్ మైలేజీ చూసుకుంటే ఇది 74 kmpl మైలేజీని అందిస్తుంది.

ఈ సెగ్మెంట్ బైక్స్‌లో ఇది చాలా ఎక్కువ అని చెప్పవచ్చు.ఇక దీని గరిష్ఠ వేగం 86 kmph కాగా ఇది సిటీ రైడింగ్ అవసరాలకు సరిపోతుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
కుంభమేళాలో విషాదం.. ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ప్రాణాలు వదిలిన పోలీస్..!

ఈ బైక్‌ మరిన్ని విషయాలు తెలుసుకుంటే ఇది 112 కిలోల కర్బ్ వెయిట్ ఉంటుంది, 9.1 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ( Fuel tank capacity ) ఆఫర్ చేస్తుంది.162 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 760 మిమీ సీట్ హైట్‌తో రైట్ చేయడానికి అందరికీ వీలుగా ఉంటుంది.ఫ్రంట్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, బ్యాక్ వీల్ డ్రమ్ బ్రేక్‌లు, ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపున హైడ్రాలిక్ సస్పెన్షన్ కలదు.

Advertisement

తాజా వార్తలు