కలెక్టర్ పై దాడిని ఖండించిన నేరేడుచర్ల రెవెన్యూ అధికారులు

సూర్యాపేట జిల్లా: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కలెక్టర్ తో పాటు పలువురు అధికారులపై దాడి నేపథ్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల తాహసిల్దార్ కార్యాలయం ఎదుట దాడిని ఖండిస్తూ,రెవిన్యూ అధికారులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా తాహసిల్దార్ సైదులు మాట్లాడుతూ.

వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ప్రజా అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్,అడిషనల్ కలెక్టర్,ప్రత్యేక అధికారి, తదితర ప్రభుత్వ అధికారులపై,కార్లపై రాళ్లు కర్రలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ మౌనిక, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Nereducharla Revenue Officials Have Condemned The Attack On The Collector, Nered
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పిన బండ్ల గణేష్.. అసలేం జరిగిందంటే?

Latest Suryapet News