అధికారుల అలసత్వం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం...!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ పట్టణంలోని 10వ వార్డు పరిధిలో గోవిందపురం వెళ్లే మూల మలుపు వద్ద గాంధీ పార్క్ సెంటర్ లో మాన్యువల్ మూత పగిలి ప్రమాదకరంగా మారిందని సామజిక కార్యకర్త ఆకుల రాము అన్నారు.

శనివారం హుజూర్ నగర్ లో ఆయన మాట్లాడుతూ ఈ మాన్యువల్ మూత పగిలి చాలాకాలం అవుతుందని, ఈ రోడ్డు నుండి సింగారం, గోవిందపురం వెళ్ళే ద్విచక్ర వాహనదారులతో, శివాలయం,అమ్మవారి ఆలయాలకు వెళ్లే భక్తులచే నిత్యం రద్దీ ఉండే ప్రాంతం కావటం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని,అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

సంబంధిత అధికారులు, పాలకమండలి వెంటనే స్పందించి మరమ్మత్తులు చేయించి,ప్రమాదాల బారిన పడకుండా ప్రజల్ని కాపాడాలని కోరారు.

పోటెత్తుతోన్న ఎన్ఆర్ఐ పెట్టుబడులు .. త్రివేండ్రంలో రియల్ ఎస్టేట్ బూమ్

Latest Suryapet News