చిరంజీవి కన్ను దానిపై పడిందా ? రాజకీయ సంబంధాలు అందుకేనా ?

మెగా స్టార్ చిరంజీవి ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ గా లేకపోయినా రాజకీయాల్లో ఆయనకు సంబందించిన చర్చలు మాత్రం జోరందుకున్నాయి.మెగా స్టార్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు.

ఆయనకు ఫలానా పదవి దక్కబోతోంది అనే చర్చలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి.దీనికి కారణం కూడా లేకపోలేదు.

రాజకీయాల్లో యాక్టివ్ గా లేకపోయినా తరచుగా రాజకీయ నాయకులను కలుస్తూ ఉండడం వారితో మంతనాలు చేయడం చేస్తున్నారు.కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ ను సతీసమేతంగా విజయవాడ వెళ్లి కలిశారు.

ఆ తరువాత ఓ సమావేశంలో మాట్లాడుతూ జగన్ పాలన అద్భుతంగా ఉందని, జగన్ ను కలిసినప్పుడు ఆయన చాలా మర్యాదగా వ్యవహరించారని, మీరు ఏది చెబితే అది అన్నా అంటూ తాను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని సమస్యలను వివరించినప్పుడు చెప్పారని చిరు అన్నారు.జగన్ నేను ఊహించని విధంగా స్పందించి ఆయన వ్యక్తిత్వం మరోసారి నిరూపించుకున్నారు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

Advertisement

తాజాగా హైదరాబాద్ లో ఓ సినిమా వేడుకలు పాల్గొన్న చిరు మరోసారి జగన్ ను పొగిడారు.ఆ తర్వాత ఏపీ లో మూడు రాజధానులకు తాను మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు.జగన్ ఏదైనా సరైన నిర్ణయం తీసుకుంటారు అంటూ చెప్పారు.

ఈ వ్యాఖ్యలతో చిరంజీవి రాజకీయాల్లోకి రాబోతున్నారని, జగన్ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెడుతున్నారని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి.చిరు తమ్ముడు పవన్ జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో ఉన్నా ఆ పార్టీకి మద్దతు ఇవ్వకుండా జగన్ ను పొగడడం పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయినా పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు.మూడు రోజుల క్రితం ఇదే విధంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను చిరంజీవి, నాగార్జున కలిశారు.ఈ సందర్భంగా సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ ఆయన కోరినట్టుగా వెల్లడించారు.

అలాగే శంషాబాద్ లో ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరినట్టు వివరాలు బయటకు వచ్చాయి.తెలంగాణలోనూ ఏపీలోనూ చిరంజీవి రాజకీయ పరిచయాలు మెరుగుపరుచుకోవడం వెనుక కారణాలు బలంగానే ఉన్నాయి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...

రాజకీయాలకు దూరంగా ఉన్నా సినిమా ఇండస్ట్రీకి మాత్రం తాను పెద్ద దిక్కుగా ఉండాలని చిరంజీవి భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇలా సమర్థవంతంగా సేవలందించడానికి ఇటు ఏపీ అటు తెలంగాణలోనూ ప్రభుత్వాలతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దన్న పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్నారు.అందుకే తరచుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమావేశాలలో పాల్గొంటున్నారు.

Advertisement

పరిశ్రమలకు సంబంధించి అన్ని సమస్యలకు తానే ముందుండి పరిష్కారమార్గం వెతుకుతున్నారు.ప్రస్తుతం చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను మాత్రమే పట్టించుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు.

గతంలో సినిమా ఇండస్ట్రీకి దాసరి నారాయణరావు ఏ విధంగా అయితే అండగా నిలిచారో ఇప్పుడు అదే స్థానంలో ఉండి సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండాలని చూస్తున్నారు.

తాజా వార్తలు