ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్

ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్ట పెరగడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ వ్యూహాలు.

అందుకే నరేంద్ర మోడీని భారతీయులు మునుపెన్నడూ లేనంత మెజారిటీతో రెండవసారి గెలిపించారు.

నరేంద్ర మోడీకి జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీగా క్రేజ్ పెరిగింది.ఆ క్రేజ్ ను సాక్షాత్తు అమెరికా ఎన్నికల్లో గెలవడం కోసం ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించుకుంటున్నారు.

Narendra Modi Twitter Hacked, India, Narendra Modi, Twitter Account, Hacked, Ame

భారతీయులు ఎప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా భారత ప్రధానమంత్రి ఫోటోలు ముందు పెట్టుకొని అక్కడి ఎన్నికల క్యాంపెయిన్ కు వెళ్తారని ఎవరూ కలలో కూడా అనుకోలేదు కానీ అదిప్పుడు సాధ్యమైంది దానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ.నరేంద్ర మోడీ క్రేజ్ ను అమెరికా,ఇజ్రాయిల్ అధ్యక్షులే కాదు ఇప్పుడు హాకర్స్ కూడా గుర్తించినట్లు ఉన్నారు అందుకే తాజాగా ఆయన ట్విట్టర్ ఖాతాను కొందరు హాకర్స్ హ్యాక్ చేశారు.

ఆయన ట్విట్టర్ ఖాతా నుండి క్రిప్టోకరెన్సీ ద్వారా విపత్తు ఉపశమన చర్యలకు నిధులు సాయం చేయాలంటూ పలుమార్లు ట్వీట్లు చేశారు.దీన్ని గుర్తించిన ట్విట్టర్ నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు అధికారికంగా ప్రకటించింది.

Advertisement

అలాగే మునుముందు ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం చర్యలు చేపడుతున్నామని ట్విట్టర్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.అమెరికా ఉపాధ్యక్షుడు జో బైడెన్, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తర్వాత జరిగిన హై ప్రొఫైల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ ఇదేనని ట్విట్టర్ కన్ఫర్మ్ చేసింది.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు