పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో నారా లోకేష్ వైసీపీ పై తీవ్ర విమర్శలు..!!

టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు పర్యటన చేపట్టారు.పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల తో.

సమావేశమైన సమయంలో వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పోలవరం నిర్వాసితులకు ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది, ఆ మాట ఇప్పటివరకు నిలబెట్టుకోలేదని ఒక ఇల్లు కూడా పోలవరం నిర్వాసితులకు కటీంచలేదని విమర్శించారు.

అంతేకాకుండా వరదల సమయంలో కూడా ఎవరిని ఆదుకో లేదని నాడు నిర్వాసితులకు 2500 రూపాయలు ఇవ్వలేని ప్రభుత్వం ఇప్పుడు 10 లక్షలు ఇస్తుందా? అని ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్టు వెనకాల కొన్ని లక్షల మంది ప్రజల త్యాగం ఉందని కానీ వైసిపి నాయకులు మాత్రం.

చాలా లైట్ తీసుకుంటున్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.పోలవరం నిర్వాసితులకు జగన్ జల సమాధి చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

ఈ ఏడాది జులై మాసం కి పూర్తి చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసిందని నిలదీశారు.వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం కోసం ఖర్చు చేసింది కేవలం 850 కోట్ల రూపాయలు మాత్రమే నని లోకేష్ చెప్పుకొచ్చారు.

చంద్రబాబు అధికారంలో ఉన్న టైంలో పోలవరం పనులు చాలా స్పీడ్ గా జరిగాయని జగన్ వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనులు స్లోగా జరుగుతున్నాయని రివర్స్ టెండరింగ్.అంటూ కాలం వెళ్ళబుచ్చే కబుర్లు చెబుతున్నారని.

జగన్ అనీ గాలి మాటలు చేయబోతున్నట్లు సీరియస్ వ్యాఖ్యలు చేశారు లోకేష్.

నేడు జనసేనలోకి బాలినేని .. పవన్ పెట్టిన కండిషన్స్ ఏంటి ?
Advertisement

తాజా వార్తలు