కొత్త డైరెక్టర్లను నాని అందుకే ఓకే చేశాడా.. ఆయన టెస్ట్ పాస్ అయ్యాకనే..

న్యాచురల్ స్టార్ నాని(Nani) సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా ఇష్టం.

కుటుంబ సభ్యులు అందరితో కలిసి కూర్చుని చూసే విధంగా నాని సినిమాలు ఉంటాయి.

అందుకే ఈయన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.నాని తన కెరీర్ లో ఒక సినిమా ముగియకుండానే మరో సినిమా ప్రకటిస్తాడు అనే విషయం తెలిసిందే.

ఇప్పుడు కూడా నాని అదే చేస్తున్నాడు.ప్రెజెంట్ నాని మరో కొత్త సినిమా స్టార్ట్ చేసాడు.

నాని కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్(Shauryan) తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే గ్రాండ్ లాంచ్ అయ్యింది.

Advertisement

ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా.హీషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.

అలాగే మృణాల్ ఠాకూర్ (Mrinal Thakur)హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.

ఇక నాని మరో సినిమా దసరా(Dasara).ఈ సినిమా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)డైరెక్ట్ చేసాడు.ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా మార్చి 30, 2023 లో భారీ స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.ఇక ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

మరి నాని ఈ ఇద్దరు డైరెక్టర్లకు ఛాన్స్ ఎందుకు ఇచ్చాడు అనే విషయం మీద తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.నానికి వీరిద్దరూ కథ చెప్పే ముందు ఆయన పెట్టిన టెస్ట్ లో పాస్ అయ్యారని తెలుస్తుంది.కథలో కొన్ని సీన్స్ ను డబ్బులిచ్చి మరీ షూట్ చేసుకుని రమ్మని చెప్పారట.

వారు అలానే చేయగా ఈ సీన్స్ నానిని ఇంప్రెస్ చేశాయని అందుకే ఇద్దరు కొత్త డైరెక్టర్లకు నాని అవకాశం ఇచ్చినట్టు టాక్.మరి ఈయన నమ్మకాన్ని వీరు ఎంత కాపాడు కుంటారో వేచి చూడాలి.

తాజా వార్తలు