బిగ్ బాస్ హామీదా అందం రియల్ కాదా.. అంతా సర్జరీల మాయేనా?

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమం రోజురోజుకు తీవ్ర ఉత్కంఠ నడుమ కొనసాగుతోంది.

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఒక చిన్న మాట మాట్లాడినా దానికి పెడార్థాలు తీస్తూ కంటెస్టెంట్ లు పెద్ద ఎత్తున గొడవలు పడుతున్నారు.

ఈ విధంగా గొడవలు కొట్లాటలు మధ్య రెండు వారాలు పూర్తి చేసుకుని ఇద్దరు కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.ఇక తాజాగా మూడవ వారం నామినేషన్స్ జరగగా ఈ నామినేషన్ ప్రక్రియలో కూడా కంటెస్టెంట్ లు మరొకరిని నామినేట్ చేయడానికి గల కారణం ఏంటో చెబుతూ గొడవలు పడినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఈ వారం నామినేషన్ లిస్ట్ లో చాలామంది కంటెస్టెంట్ లు ప్రియని టార్గెట్ చేశారు.హమీదా ప్రియ ను టార్గెట్ చేస్తూ.

తనని నామినేట్ చేయడానికి గల కారణం కూడా తెలియజేస్తుంది.హౌస్ లో ప్రియా తనను ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉందని.

Advertisement
Nagarjuna Telugu Bigg Boss Season 5 September 21 Written Updates Third Week Nomi

తన శరీరంపై కట్స్ ఉంటే సర్జరీ చేయించుకున్నావా? అని బాడీ షేమింగ్ చేస్తూ తనని చాలా బాధపెట్టిందని తెలిపారు.ఎన్నో కోట్ల మంది చూసే ఈ కార్యక్రమంలో నువ్వు సర్జరీ చేయించుకున్నావా? అని అడిగితే తనకు ఎలా ఉంటుందని ఈ విషయాన్ని గుర్తు చేస్తూ హమీదా ఎమోషనల్ అయ్యారు.హమీదా ఈ విధంగా ప్రియను అడగడంతో అందుకు ప్రియా తాను అలా మాట్లాడలేదని నేను ఒక విధంగా మాట్లాడితే తను ఒక విధంగా అర్థం చేసుకుందని తెలిపింది.

Nagarjuna Telugu Bigg Boss Season 5 September 21 Written Updates Third Week Nomi

నేను మాట్లాడింది ప్రియాంకకు సర్జరీ జరిగింది కనుక తనికి ఏ చిన్న గాయం అయినా కూడా ఎంతో నొప్పిగా ఉంటుందని.నువ్వు కూడా అలా బాధపడుతుంటే నీకేమైనా సర్జరీ జరిగిందా? అని అడిగాను తప్ప మరి ఏ ఉద్దేశంతో అడగలేదని కావాల్సి వస్తే ఈ విషయం గురించి ప్రియాంకను అడుగు అని ప్రియా చెప్పింది.ఆ తర్వాత హమీదా మాట్లాడుతూ నేనేం చిన్నపిల్లని కాదు మీ అంత పెద్ద సెలబ్రిటీ కాకపోయినా.

నాలో కూడా ఏదో ఉందనే ఇక్కడికి పిలిచారు అంటూ ప్రియా ఉన్న టైల్ బద్దలు కొడుతూ తనని నామినేట్ చేసింది.ఈ విధంగా హమీదా ప్రియా పై కోప్పడుతూ తనని నామినేట్ చేయడంతో రవితో పాటు మరికొంతమంది చప్పట్లు కొడుతూ హమీదాకి మద్దతు తెలిపారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు