నాగార్జున సినిమా ఈ ఏడాది విడుదల అయ్యేనా? లేదా?

నాగార్జున సినీ కెరియర్ కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్లుగా అనిపిస్తుంది.

గత సంవత్సరం బంగార్రాజు మరియు ది ఘోస్ట్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున బంగార్రాజు సినిమా తో పర్వాలేదు అనిపించుకున్నా కూడా ది ఘోస్ట్ సినిమా తో సక్సెస్ ని సొంతం చేసుకోలేక పోయాడు.

గత సంవత్సరం చివర్లో విడుదలైన ది ఘోస్ట్ సినిమా తాలూకు షాక్ నుండి అక్కినేని ఫ్యాన్స్ ఇంకా కోరుకున్నట్లుగా లేరు.ఇక నాగార్జున తదుపరి సినిమా విషయం లో ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.

అయితే ధమాకా రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వం లో నాగార్జున సినిమా రూపొందుతుందని ప్రచారం జరుగుతుంది.అధికారికంగా ప్రకటించకుండానే, అధికారికంగా పూజా కార్యక్రమాలు నిర్వహించకుండానే సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.

Nagarjuna New Film Release Confusion , Nagarjuna , New Film, Bangarraju , Toll

ఆ విషయం లో నిజం ఎంతుంది అనేది క్లారిటీ లేదు కానీ కనుక నాగార్జున ఈ సంవత్సరం లో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.ఈ మధ్య కాలం లో చాలా మంది హీరోలు ఒక్కొక్క సినిమా కు సంవత్సరాలకు సంవత్సరాలు తీసుకుంటున్నారు.ఈ సంవత్సరం పలువురు యంగ్ హీరోల యొక్క సినిమా లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

Advertisement
Nagarjuna New Film Release Confusion , Nagarjuna , New Film, Bangarraju , Toll

అలాగే నాగార్జున సినిమా కూడా ఈ సంవత్సరం ఉందా లేదంటే ఆయన సినిమా కోసం వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందేనా అంటూ అక్కినేని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Nagarjuna New Film Release Confusion , Nagarjuna , New Film, Bangarraju , Toll

ఒకవేళ ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వం లో సినిమా కన్ఫామ్ అయ్యి షూటింగ్ శరవేగంగా జరిగితే ఇదే సంవత్సరంలో నాగార్జున సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఏం జరగబోతుందో కాలమే సమాధానం చెప్పనుంది.నాగార్జున కి ఈ సినిమా సక్సెస్ అత్యంత కీలకం.

కనుక ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు