ఏపీలో ఎంపీ వ‌ర్సెస్ మంత్రి... మంత్రి రాజీనామా చేస్తారా ?

ఏపీలో అధికార వైసీపీ విప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ఎత్తులు, పై ఎత్తులు, విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌ల‌తో రాజ‌కీయం వేడుక్కుతోంది.

ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సాక్షిగా మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ వ‌ర్సెస్ విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మ‌ధ్య మాట‌లు, స‌వాళ్ల‌తో కూడిన యుద్ధం న‌డుస్తోంది.

వెల్లంప‌ల్లి మాట్లాడుతూ చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోనే వైసీపీ 89 స‌ర్పంచ్‌ల‌కు ఏకంగా 75 గెలిచింద‌ని టీడీపీ ప‌నైపోయింద‌ని విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు చంద్ర‌బాబు రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌ని డిమాండ్ చేశారు.ఇక త్వ‌ర‌లో జ‌రిగే విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ స్వీప్ చేస్తుంద‌న్న ధీమా మంత్రి వ్య‌క్తం చేశారు.

ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ?  కూడా తెలియ‌ద‌ని వెల్లంప‌ల్లి ఎద్దేవా చేశారు.ఇక టీడీపీలోనే అనేక వ‌ర్గాలు ఉన్నాయంటూ ప‌రోక్షంగా విజ‌య‌వాడ టీడీపీ నాయ‌కుల‌ను ఆయ‌న టార్గెట్ చేశారు.

కుప్పం, మైలవరం లాంటి టీడీపీ హేమహేమిలు ఉన్న ప్రాంతాల్లో కూడా వైసీపీ ఆధిపత్యం సాధించింద‌ని వెల్లంప‌ల్లి చెప్పారు.

Mp Vs Minister In Ap ... Will The Minister Resign,ap,ap Political News,jaleel Co
Advertisement
MP Vs Minister In AP ... Will The Minister Resign,ap,ap Political News,jaleel Co

ఇక ఎంపీ కేశినేనిని టార్గెట్ చేస్తూ నాని త‌న అఫిడ‌విట్‌లో లేబ‌ర్ కోర్టులో పెండింగ్ కేసు ప్ర‌స్తావిస్తూ ఆయ‌న రు.1.47 కోట్లు ఉద్యోగుల‌కు చెల్లించాల్సి ఉంద‌న్నారు.దీనిపై మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు.

ఎంపీ కేశినేని ఎస్కార్ట్ ప‌క్క‌న మంత్రి వెల్లంప‌ల్లి ఓ పిల్ల కాకిలా ఉన్నాడ‌ని ఒక‌రి వ్య‌క్తిగ‌త విష‌యాల్లోకి మ‌రొక‌రు త‌ల‌దూర్చాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.ఇక వెల్లంప‌ల్లి చ‌రిత్ర పుస్త‌కం త‌న వ‌ద్ద ఉంద‌న్న జ‌లీల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మంత్రి ప్ర‌చారం చేసిన చోట టీడీపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించి చూపిస్తామ‌ని స‌వాల్ విసిరారు.

ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి మెజార్టీ వస్తుందా ?  టీడీపీకి మెజార్టీ వ‌స్తే మంత్రి వెల్లంప‌ల్లి రాజీనామా చేస్తారా ? అని ఎంపీ నాని స‌వాల్ విసిరారు.మ‌రి నాని చెప్పిన‌ట్టు టీడీపీకి ఆధిక్య‌త వ‌స్తే మంత్రి రాజీనామా చేస్తారా ?  కార్పొరేష‌న్ తీర్పు ? ఎలా ఉంటుందో ?  చూడాలి.

మంచు ఫ్యామిలీ జరుగుతున్న గొడవలు కన్నప్ప మీద ఎఫెక్ట్ చూపిస్తాయా..?
Advertisement

తాజా వార్తలు