ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలి: ఎస్.వీరయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు.

శనివారం భువనగిరి పట్టణంలోని వైఎస్సార్ ఫంక్షన్ హాల్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 15,16 తేదీల్లో నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అవలంభించిన ప్రజావ్యతిరేక విధానాల ప్రజా ఆదరణ కోల్పోయి సీట్లు తగ్గాయన్నారు.

జిఎస్టి,పెద్దనోట్ల రద్దు,రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు వల్ల దేశంలో బీజేపీకి ప్రజల్లో బలం తగ్గిందని,400 సీట్లు వస్తాయనుకున్న బీజేపీకి 240 మాత్రమే వచ్చాయని, తన ఎన్డీఏ కూటమికి కలుపుకుంటే 292 సీట్లు వచ్చినాయన్నారు.రాజ్యాంగాన్ని మార్చడానికి పూనుకున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తగిన విధంగా తీర్పు ఇచ్చారన్నారు.

రైతులు నాట్లు వేస్తున్నారని,ఇప్పుడు రుణమాఫీ చేస్తే రైతులకు ఉపయోగకరమన్నారు.నిట్ పరిక్ష పేపర్ లీక్ కారకులపై చర్యలు తీసుకోవాలని,రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇతర హామీలు వెంటనే అమలు చేయాలనిడిమాండ్ చేశారు.

Advertisement

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం డి జహింగీర్,రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ,బట్టిపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహ,మాటూరి బాలరాజు,కల్లూరు మల్లేశం, దాసరి పాండు,మేక అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమంతను వదలని ఆ ఇద్దరు డైరక్టర్లు...మరో ఛాన్స్ కొట్టేసిన నటి!
Advertisement

Latest Video Uploads News