మంత్రికి వినతిపత్రం ఇచ్చిన పి.డి.ఎస్.యు నేతలు

సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండల కేంద్రంలో మోడల్ స్కూల్,గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని,ప్రభుత్వ పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.

 The Pdsu Leaders Gave The Petition To The Minister, Pdsu Leaders , Petition , Mi-TeluguStop.com

ఎస్.యు) అధ్వర్యంలో అందజేశారు.శనివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి వచ్చిన రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి విన్నవించారు.వెంటనే స్పందించిన మంత్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్లు,మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టుటకు వ్యక్తిగతంగా రూ.10 లక్షలు ఇచ్చారు.సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈసందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు పుల్లూరు సింహాద్రి,

డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఈ మండల కేంద్రంలో గురుకుల,మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని అనేక దఫాలు విన్నవించుకున్నా పట్టించుకోలేదని విమర్శించారు.ఇప్పటికైనా ఈ పాఠశాలలు మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరారు.ప్రభుత్వ విద్యను బలోపేతం చేయుటకు కాంగ్రెస్ ప్రభుత్వమైన చొరవజేసి సమస్యలు పరిష్కరించాలని మంత్రిని వేడుకున్నారు.అనేకమంది పేద విద్యార్థులు నాణ్యమైన విద్య పొందుటకు తల్లిదండ్రులు రెక్కల నమ్ముకొని ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారని,దీనికి స్వస్తిపలకాలన్నారు.కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టడం వలన అందరికీ నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు నాయకులు మణికుమార్, గణేష్,వెంకటేశ్,షరీఫ్,లవ కుమార్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube