ఆరేళ్ల కుమారుడి కోసం అదిరిపోయే టైం టేబుల్.. అమ్మ ప్రేమపై కామెంట్ల వర్షం!

చిన్నప్పుడు పిల్లలు బాగా చదివేందుకు బడిలోని ఉపాధ్యాయులు, ఇంట్లోని తల్లిదండ్రులు టైం టేబుల్ ఏర్పాటు చేయడం మనకు తెలిసిన విషయమే.

అయితే వాటిని కచ్చితంగా పిల్లలు పాటించేలా తల్లిదండ్రులు సాయం చేసే వాళ్లు.

తినడానికి, పడుకోవడానికి, ఆడుకోవడానికి, చదువుకోవడానికి ఇలా ఏం చేయడానికైనా సరే టైం టేబుల్ లో మెన్షన్ చేసే వాళ్లు.ఇలా చేయడం వల్ల పిల్లలకు మంచి ప్రవర్తనతో పాటు సమయం విలువ తెలుస్తుందని అందరి నమ్మకం.

Mother Creates Time Table For His Six Years Old Son Mother, Creates Time Table

అయితే తన ఆరేళ్ల కుమారుడి కోసం ఈ తల్లి.అదిరిపోయే టైం టేబుల్ ను ఏర్పాటు చేసింది.

దీని వల్ల తన గారాల పట్టికి మంచి ప్రవర్తన, టైం విలువ తెలుస్తుందని ఆమె ఇలా చేసింది.అయితే ఆమె అతడి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన టైం టేబుల్.

Advertisement

నెట్టింట వైరల్ గా మారింది.అయితే ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రీడిట్ ఖాతాలో వైరల్ అవుతోంది.ఆరేళ్ల బాలుడి కోసం తయారు చేసిన ఈ టైం టేబుల్ లో ఆ తల్లి.7.50 కి అలారం మోగుతుందని రాయగా.లేవడానికి పది నిమిషాల సమయాన్ని కూడా ఇచ్చింది.

ఆ తర్వాత పళ్లు తోముకోవడం, స్నానం చేయడం, టిఫిన్, పండ్లు తినడం, పాలు తాగడం, టెన్నిస్ ఆడుకోవడం, హోం వర్క్ చేయడం, డిన్నర్, క్లీనింగ్, నిద్రపోయే సమయం వరకు ఏమేం చేయాల్లో అన్నింటిని పొందుపర్చింది.అయితే ఇందులో ఉన్నట్లుగానే చేస్తే.

అంటే ఈ రోజంతా బాలుడు టైం టేబుల్ ఫాలో అయితే రివార్డుగా 10 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు.ఇదే విధానాన్ని వారం రోజులు ఫాలో అయితే 100 ఇవ్వనున్నట్లు వివరించారు.

బాగుంది కదా.మీరూ మీ పిల్లల కోసం ఇలా ఏదైనా కొత్తగా ట్రై చేయండి.

రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!
Advertisement

తాజా వార్తలు