చనిపోయిన చెల్లికి పాలుపట్టిన.. ఆ ఘటన గుర్తొస్తే కన్నీళ్లు ఆగవన్న విజయ..

కెఆర్ విజయ. తెలుగు సినిమా పరిశ్రమలో మంచి నటీమణి.

తన పేరు వింటే ఏ తమిళ నటో? కేరళ నటో? అనుకుంటారు చాలా మంది.

కానీ తన తండ్రి రామచంద్రన్ తెలుగు వాడు.

చిత్తూరు జిల్లా వాసి.తల్లి తమిళ మహిళ.

రామ చంద్రన్ ఇండియన్ ఆర్మీలో పని చేసేవాడు.తన ఫ్రెండ్ తో కలిసి కేరళకు వెళ్లాడు.

Advertisement

అక్కడ తన చెల్లిని చూసి ఇష్టపడ్డాడు.ఈ విషయం తన స్నేహితుడికి చెప్పాడు.

వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు.దీంతో వారి పెళ్లి జరిగింది.

వారికి జన్మించిన అమ్మాయి విజయ.వాస్తవానికి ఆమె అసలు పేరు దైవ నాయకి. తనకు చిన్నప్పటి నుంచే స్టేజి నాటకాలు అంటే చాలా ఇష్టం.11 ఏండ్ల వయసు నుంచి తను కూడా నాటకాలు వేయడం మొదలు పెట్ది.నెమ్మదిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.

కర్పగం అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.నవ్వుల రారాణి అనే బిరుదు అందుకుంది.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా శ్రీ‌కృష్ణ పాండ‌వీయంలో రుక్మిణి క్యారెక్టర్ చేసింది.తెలుగు సినిమా పరిశ్రమలో తనకు ఇది తొలి సినిమా.

Advertisement

అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ వెనక్కి తిరిగి చూసుకోలేదు విజయ.గొప్ప హీరోయిన్ గా ఎదిగింది.

అయితే తన జీవితంలో ఓ మర్చిపోలేని విషాద ఘటన ఉందని చెప్తుంది విజయ.ఆ ఘటన తనను ఇప్పటికీ కంట తడి పెట్టిస్తుందని వెల్లడించింది.తన చెల్లెలు చనిపోయిందని తెలియక ఒళ్లో కూర్చోబెట్టుకుని పాలు పట్టిన సందర్భం అది అని వెల్లడించింది.

ఓ రోజు చెల్లికి ఒంట్లో బాగాలేదు.అమ్మకూడా అనారోగ్యంగా ఉంది.

చెల్లికి మందులు తీసుకురావడానికి మూడు మైళ్ల దూరంలో ఉన్న డాక్టరు దగ్గరికి వెళ్లింది.అయితే డాక్టర్ కు వెళ్లి చెప్తే ఆయన సరిగా పట్టించుకోలేదు.

ఆమె చెప్పేది తన తల్లి గురించి అనుకుని నేను వెళ్లి చూస్తాను లే అని చెప్పాడు.

సరే అని ఇంటికి వచ్చింది విజయ.చెల్లెల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని కూర్చుంది.చెల్లి కళ్లుమూసుకుని ఉంది.

పాలు పడదామని పాలపీక నోట్లో పెట్టింది.అయితే తను కదల్లేదు.

నిద్రపోతుందేమో అనుకుంది.ఇంతలో పెద్దవాళ్లు వచ్చారు.

విజయ పాలు పట్టడం.పాప తాగకుండా కిందకు కారడం చూశారు.

దగ్గరికి వచ్చి చూసి ఏడుపు మొదలు పెట్టారు.అప్పుడే తనకు తెలిసింది చనిపోయిన చెల్లికి పాలు పడుతున్నానని.

వెంటనే తనూ ఏడ్వటం మొదలు పెట్టింది.ఆరోజు తన చెల్లికి వైద్యం అంది ఉంటే చనిపోయేది కాదని చెప్పింది విజయ.

తాజా వార్తలు