మూన్‌వాక్ చేసిన నీటిగుర్రం.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

మనం ఇప్పటి వరకు చాలా రకాల డ్యాన్స్‌లు చూసి ఉంటాం.

బెల్లీ డ్యాన్స్, మూన్‌వాక్, రోబో డ్యాన్స్ ఇలా మనుషులు సరికొత్త డ్యాన్స్‌ స్టెప్పులు వేయడం చూసే ఉంటాం.

కానీ, హిప్పో( Hippo ) అనే జంతువు కూడా డ్యాన్స్ చేస్తుందని ఎప్పుడైనా విన్నారా? హిప్పో ఏంటి, డ్యాన్స్‌ చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ, అయితే రీసెంట్ గా అలాంటి ఆశ్చర్యకరమైన దృశ్యం కెమెరాకు చిక్కింది.సోషల్ మీడియాలో ఆ హిప్పో డ్యాన్స్( Hippo Dance ) చేస్తున్న వీడియో చాలా వైరల్ అవుతోంది.

Moo Deng Hippo Charms Internet With Her Moonwalk Video Viral Details, Moo Deng,

బ్యాంకాక్‌లోని "కెహో కీవ్ ఓపెన్ జూలో"( Khao Kheow Open Zoo ) ఈ హిప్పో మూన్ వాక్ చేసింది.ఇది చాలా ఫేమస్ అవుతోంది.దీని పేరు మూ డెంగ్.

( Moo Deng ) రెండు నెలల వయసు ఉన్న ఈ పిల్ల హిప్పో తన అందం, బ్యూటిఫుల్ పర్సనాలిటీతో అందరి హృదయాలను దోచుకుంటోంది.ఈ పిల్ల హిప్పో రోజూ ఏం చేస్తుందో దాని సంరక్షకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.

Advertisement
Moo Deng Hippo Charms Internet With Her Moonwalk Video Viral Details, Moo Deng,

ఆ ఫోటోల్లో మూ డెంగ్ తనకు ఇష్టమైన స్నాక్స్ తింటుంది, గడ్డి మీద గుండ్రంగా తిరుగుతుంది, నీళ్ళలో ఆడుకుంటుంది, తన సంరక్షకులతో ఆడుకుంటుంది.దీని వీడియోలు చూసిన వాళ్లు ఎంతో ఆనందిస్తున్నారు.

Moo Deng Hippo Charms Internet With Her Moonwalk Video Viral Details, Moo Deng,

మూ డెంగ్ హిప్పో తాజాగా మైఖేల్ జాక్సన్ లాగా మూన్‌వాక్ డ్యాన్స్( Moonwalk Dance ) చేసింది.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌ (ట్విట్టర్)లో ఇది చేసిన మూన్‌వాక్‌కి సంబంధించి ఓ వీడియో చాలా పాపులర్ అవుతోంది.ఆ వీడియోలో మూ డెంగ్ తన ఎన్‌క్లోజర్‌లో మైఖేల్ జాక్సన్ లాగా వెనక్కి జారుతూ నడుస్తుంది.

దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.ఆ వీడియోకి "వోవ్, ఆగండి.

మూ డెంగ్ మూన్‌వాక్ చేస్తుంది." అని ఒక క్యాప్షన్ జోడించారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. పైచేయి సాధించిన అమ్మాయిలు..!

మూ డెంగ్ డాన్స్ చేయడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.కొంతమంది మూ డెంగ్ చాలా అందంగా ఉందని, చాలా ఫన్నీగా ఉందని చెప్పారు.

Advertisement

ఒక నెటిజన్ మూ డెంగ్ చాలా బాగా డాన్స్ చేస్తుందని, జాక్సన్‌ని గుర్తు చేశారు.మూ డెంగ్‌ని డ్యాన్సింగ్ క్వీన్ అని కూడా అన్నారు.

మూ డెంగ్ వీడియో చూడగానే వారికి చాలా సంతోషంగా అనిపించిందని చెప్పారు.

తాజా వార్తలు