నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా: నల్గొండ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు,అన్ని గ్రామాలకు డబుల్ రోడ్డు వేయాలన్నది నా ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

సోమవారం నల్లగొండ జిల్లా దేవరకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరై కొత్త పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేది మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవని,మార్కెట్ కమిటీ రైతులకు మేలు చేయాలని సూచించారు.నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీరు అందిచేందుకు 2005 లో ఎస్ఎల్బీసీ ప్రారంభించామని,40 కిలోమీటర్లు పూర్తయిందని,9.5 కిలోమీటర్లు మిగిలిందన్నారు.2023 ఎన్నికల్లో కుర్చీ వేసుకుని కూర్చుని బాలూ నాయక్ ను ఓడిస్తానన్న మనిషి పత్తా లేకుండా పోయాడని ఎద్దేవా చేశారు.లక్షన్నర కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిండు కూలిందని,కానీ, ఎస్ఎల్బీసికి 2000 కోట్లు ఇవ్వలేదన్నారు.

Minister Komati Reddy Venkata Reddy Participated In The Oath Taking Ceremony Of

మా ముఖ్యమంత్రితో పట్టుబట్టి నిధులు కేటాయించుకొని, అమెరికా వెళ్లి మిషన్ రిపేర్ కి చర్యలు తీసుకున్నామని,నవంబర్,డిసెంబర్లో రెండు మిషన్ల ద్వారా పనులు మొదలుపెట్టి 30 నెలల్లో పూర్తి చేస్తామన్నారు.నాగార్జునసాగర్,నకిరేకల్,మునుగోడు నియోజకవర్గాలతో పాటు నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు.

దుర్మార్గుడు కేసీఆర్ నల్గొండ జిల్లాకు జీవనాడిలాంటి ఎస్ఎల్బిసిని నిర్లక్ష్యం చేసిండని,దేవుడు ఆయనను ఫాంహౌజుకు పరిమితం చేసిండని, మాది రైతు ప్రభుత్వం 50 కిలోమీటర్ల సొరంగం ప్రపంచంలో ఎక్కడా లేదని,వర్షాలు మీద ఆధారపడకుండా సొరంగం ద్వారా గ్రావిటీపై నీళ్లు ఇచ్చేలా చూస్తున్నామని చెప్పారు.మిషన్ భగీరథకు 6 వేల కోట్లు ఖర్చు పెట్టినమని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు,ఏ ఊర్లో నీళ్లు సరిగా వస్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

పనికిరాని పథకాలన్నీ పెట్టి ఎనిమిది లక్షలు అప్పు చేసిండని,కల్వకుర్తికి వెళ్లే జాతీయ రహదారి తమ శాఖ ద్వారా మంజూరు చేశామని,18 వేల మంది రైతులకు రెండు లక్షల పైన రుణాలను మాఫీ చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానిదని,2 లక్షలకు పెగా ఉన్న లోన్లు ఉన్నా రైతులకు కూడా త్వరలో రుణమాఫీ చేస్తామని,గత ప్రభుత్వ హయాంలో ఐదు విడతల్లో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే,అది రైతుల వడ్డీలకి కూడా సరిపోలేదన్న విషయం విడిచిపెట్టి, సిగ్గులేకుండా 50% రైతులకు రుణమాఫీ కాలేదని రాహుల్ గాంధీ ఇంటి దగ్గర ధర్నా చేస్తానని హరీష్ రావు అంటున్నడని,రైతు రుణమాఫీ విషయంలో మా ప్రభుత్వ చిత్తశుద్ధిని రైతులంతా గుర్తించారన్నారు.వచ్చే వారంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే పథకాన్ని ప్రారంభించుకుంటున్నామని,నెలకు 200 కోట్ల రూపాయలు మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు పెడుతున్నామని,500 రూపాయలకే ఎల్పీజీ ఇస్తున్నామని,10 నెలల్లో 60,000 ఉద్యోగాలు భర్తీ చేసి,అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చామని, మాల్ వద్ద స్కిల్ యూనివర్సిటీ కడుతున్నామని,ఇక్కడి యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ కు పట్టం కట్టాలని,ఇల్లు కట్టించే సోయలేదు కానీ, గత ప్రభుత్వం అవాకులు చవాకులు పేలుతున్నదని, ఐదువేల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, 8 నెలల్లో ఈ స్కూల్స్ నిర్మాణం పూర్తి చేసి అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తెస్తామన్నారు.కులమత బేధం లేకుండా అందరికి సమాన విద్యను అందిస్తామని,దసరా ముందు రోజు 19 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నామన్నారు.

కానీ కేసిఆర్ తెలంగాణ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిండని విమర్శించారు.మూడుసార్లు అసెంబ్లీ పెట్టినా కెసిఆర్ ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదని,తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రతిరోజు హాజరైన సంగతి మర్చిపోరాదన్నారు.

మూసి వల్ల ఊపిరితిత్తులు పాడై రకరకాల జబ్బులు వస్తున్నాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయని, మనమంతా మూసీ బాధితులమని,మన జీవితాలు బాగుచేసేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మూసిని ప్రక్షాళన చేయడానికి పూనుకుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయన్నారు.మూసి ప్రక్షాళనకి ఇంకా అంచనాలే రూపొందించలేదని, అప్పుడే లక్ష కోట్లు, లక్షన్నర కోట్లని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
హిల్లరీ క్లింటన్‌కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారం!!

మూసీ కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నరని, రోగాలు రాకుండా బాగుండాలని మూసీలో ఇల్లు కోల్పోయిన వారందరికీ ఇందిర ఇండ్లు కట్టియాలని ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంటే ప్రతిపక్షం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నదన్నారు.అంటే నల్గొండ,రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజలు ఆరోగ్యంగా బ్రతకొద్దా అని ప్రశ్నించారు.

Advertisement

ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మిస్తామని,నల్గొండ జిల్లాలో రోడ్ల నిర్మాణ అభివృద్ధికి 516 కోట్లు కేటాయించామని,కేటీఆర్ నిధులన్నీ నల్గొండకే తీసుకెళ్లారని ఆరోపణ చేయడం దారుణమన్నారు.

Latest Nalgonda News