మెట్రో ప్రయాణికులకు శుభవార్త ...!

భాగ్యనగరంలో ట్రాఫిక్ నుండి విముక్తి కలిగించేందుకు ఏర్పాటు చేసిన మెట్రో. కొద్ది కాలంలోనే ప్రేక్షకుల మన్ననలు పొందింది.అంతేకాక కొత్త కొత్త ఆఫర్లతో ప్రయాణికులను సైతం ఆకట్టుకుంటుంది.ఇందులో భాగంగానే మెట్రో ప్రయాణికులకు మరొక వెసులుబాటు దొరకనుంది.మెట్రో స్టేషన్ దగ్గరకు రావాలన్నా… మెట్రో స్టేషన్ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు కానీ ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తుంది.దాన్ని అధిగమించడానికి మెట్రో స్టేషన్ కింద ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులోకి రానున్నాయి.

 Metroride App For E Auto Services, Electric Auto, Hyderabad, Metro Stations, Met-TeluguStop.com

ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ సేవలను విజయవంతంగా అందిస్తున్న ఎలక్ట్రికల్‌ మొబిలిటీ అంకుర సంస్థ మెట్రోరైడ్‌. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా తమ సేవలను అందించనుంది.

సోమవారం నుండి ఈ ఆటో సేవలను ప్రారంభించనుంది. ఈ-ఆటో కావాలనుకున్న ప్రయాణికులు మెట్రోరైడ్‌ యాప్‌ ద్వారా ఆటోలను బుక్‌ చేసుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్ లో ‘మెట్రోరైడ్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రయాణాన్ని బుక్‌ చేసుకోవచ్చు.

Telugu Bangalore, Electric Auto, Hyderabad, Metro, Metro Train, App, Passengers-

వీటి ద్వారా ఇళ్లకు, ఆఫీసులకు.స్కూళ్లుకు, కాలేజీలకు సులభంగా వెళ్లిరావడానికి వీలుంటుంది.అంతేకాదు ఒకవేళ మహిళా ప్రయాణికుల కోసం.

మహిళా డ్రైవర్‌ నడిపే ఆటో లను కూడా అందుబాటులోకి తెస్తుంది.మెట్రోరైడ్‌ ఆటోడ్రైవర్లలో 20 శాతం మంది మహిళలు ఉండటం గమనార్హం.బెంగళూరులో గతేడాది ప్రారంభించినప్పుడు మొదటి కిలోమీటరుకు రూ.10, తర్వాత కి.మీకు రూ.5 చొప్పున వసూలు చేశారు.హైదరాబాద్‌లో ఛార్జీలు ఎలా ఉంటాయనేది ప్రారంభ కార్యక్రమంలో వెల్లడించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube