మధురమైన పాత చిత్రాల జ్ఞాపకాలు.. చూస్తే వావ్ అంటారు?

సాధారణంగా మన జీవితంలో జరిగిన పాత జ్ఞాపకాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటే ఆ అనుభూతి ఎంతో బాగుంటుంది.

ఈ క్రమంలోనే సినిమారంగంలో కూడా అలనాటి చిత్రాలు ఎంతో మధురమైన జ్ఞాపకాలుగా చెప్పవచ్చు.

ఇప్పుడు పాత చిత్రాలను చూస్తే కనుక అప్పట్లో ఎంతో అద్భుతంగా చిత్రీకరించారనే భావన కలగక మానదు.ఇలా పాత విషయాలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం కోసం సినిమాకి సంబంధించిన వస్తువులను, సినిమా విశేషాలను ఎంతో భద్రంగా భద్రపరుస్తూ ఉంటుంది నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్‌ ఇండియా (ఎన్ఎఫ్‌ఏఐ) .

భవిష్యత్తులో ఏ సినిమా కోసమైనా ఏ సినిమాకు సంబంధించిన చరిత్ర కోసమేనా అధ్యయనం చేయాల్సి వస్తే అందుకు ఉపయోగపడే విధంగా వివిధ రకాల మూవీ స్పెషల్స్ ని ఎన్ఎఫ్ఏఐ నిరంతరంగా అన్వేషించి భద్రపరుస్తుంది ఎన్ఎఫ్‌ఏఐ.అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలుగు సినిమాలపై దృష్టిసారించింది.

ఈ క్రమంలోనే మన తెలుగు పాత చిత్రాల జ్ఞాపకాలకు సంబంధించిన గ్లాస్ స్లైడ్స్ ని వివిధ పద్ధతుల్లో సేకరించి భద్రపరిచారు.ఇప్పటివరకు ఎన్ఎఫ్‌ఏఐ 450 కి పైగా గ్లాస్ స్లైడ్స్ ను భద్రపరిచారు.

Advertisement
Nfai Aquires 450 Glass Slides Of Old Tollywood Movies, Memories, Films, Film In

వీటివల్ల అప్పట్లో సినిమా రంగం పరిస్థితిని, సమాజం పోకడను ఎంతో అద్భుతంగా చూపించాయి.

Nfai Aquires 450 Glass Slides Of Old Tollywood Movies, Memories, Films, Film In

పాత జ్ఞాపకాలను ఎంతో భద్రంగా భద్రపరిచిన ఈ గ్లాస్ స్లైడ్స్ లో  ‘మళ్లీ పెళ్లి, వందే మాతరం, కీలు గుర్రుం, దాసీ, దేవదాసు’ వంటి ఎన్నో ఆపాత మథురమైన చిత్రాలు జాబితాలో ఉండటం విశేషమని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే రాబోయే కాలంలో మరికొన్ని గ్లాస్ స్లైడ్స్ మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన నెగటివ్స్, పోస్టర్స్, లాబీ కార్డ్స్, ఫుటేజెస్, ఫోటోస్…వంటి వాటిని కూడా భద్రపరచడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు