మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టిన కరోనా...!

దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా ఇప్పుడు మెగా కాంపౌండ్ లో కూడా అడుగుపెట్టినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులను పలకరిస్తూ వచ్చిన ఈ కరోనా మహమ్మారి తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ను కూడా టచ్ చేసినట్లు తెలుస్తుంది.

ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.మరి కొందరు కరోనా ను జయించారు.

అయితే ఇప్పుడు తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కు కూడా కరోనా సోకినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.అంతే కాకుండా త్వరలోనే కరోనా ను జయించి ప్లాస్మా దానం కూడా చేస్తానని నాగబాబు పేర్కొన్నారు.

Advertisement

కాగా నాగబాబు ట్వీట్ కు మెగా అభిమానులు పెద్ద ఎత్తున రిప్లయ్ ఇచ్చారు.మీరు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామంటూ కామెంట్స్ పెడుతూ కోరుతున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరూ వరుసగా కరోనా బారినపడుతున్నారు.

ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు కూడా కరోనా బారినపడినట్లు తెలుస్తుంది.

కుటుంబంలో గొడవలు మనోజ్ ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి... వీడియో వైరల్!
Advertisement

తాజా వార్తలు