వైరల్: దెబ్బకు దొంగ దొరికిపోయాడు... కాలమే అతని ముసుగు తొలగించిందిలా?

సోషల్ మీడియాను ఓ వైరల్ వీడియో కుదిపేస్తోంది.నిత్యం ఇక్కడ అనేక వీడియోలు నెటిజన్లకు తారసపడుతూ ఉంటాయి.

 Man Pretends To Be Physically Handicapped Exposed Details, Prank , Viral Latest,-TeluguStop.com

అయితే అందులో ఏ కొన్నో జనాలకు బాగా నచ్చుతాయి.అలా నచ్చిన వీడియోని జనాలు ఆకాశానికెత్తేస్తారు.అదేనండి… తమ తమ సర్కిల్ లో వైరల్ చేస్తూ వుంటారు.ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది.ఇక్కడ సీన్ చూస్తే సింహాద్రి సినిమాలో వేణుమాధవ్ గుర్తుకు వస్తాడు అంటే మీరు నమ్మితీరాల్సిందే.

అదే… ఆ సినిమాలోని కాళ్లు పడిపోయినట్లు నటిస్తూ వీల్ చైర్‌లో కూర్చుని వైద్యశాలలో పెట్టే ఉచిత ఆహారాన్ని ముప్పొద్దులా మెక్కేస్తుంటాడు… ఆ సీన్.మీకు గుర్తుంది కదూ.కావాలంటే ఇక్కడ వీడియో చూడండి… మీకు పై సీన్ గుర్తుకు రాకపోతే అప్పుడడగండి! కాగా వైరల్ అవుతున్న వీడియోని చూసి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.ఇలాంటివి సినిమాలలో చూసాం గాని, ఇలా నిజ నిజజీవితంలో కూడా ఉంటారని ఫస్ట్ టైం చూస్తున్నాం అని కింద కామెంట్స్ చేస్తున్నారు.కొంతమందైతే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.

విషయంలోకి వీలైతే, వైరల్ అవుతున్న వీడియోని ఒక్కసారి మీరు గమనిస్తే….అచ్చం కుంటివాడిలా నటిస్తూ… ఓ వ్యక్తి వీల్‌చైర్‌లో కూర్చుని బిక్షాటన చేస్తున్నాడు.ఆ విషయం తెలియని అమాయక గొర్రెలు అదేనండి… మన ప్రజలు వాడికి డబ్బులు కుమ్మరిస్తున్నారు.బహుశా! వాడికి రోజూ అదేపని అని అర్ధం చేసుకోవచ్చు.

ఈ క్రమంలో ఆటగాడు వీల్‌చైర్‌ను రోడ్డుపై నెట్టుకుంటూ రోడ్డుదాటేందుకు ప్రయత్నిస్తాడు.ఇంతలో ఊహించని ఉపద్రవం.

అతని వీల్ చైర్ వైపు ఓ వైక్ రెప్పపాటు వేగంతో దూసుకొచ్చింది.కట్ చేస్తే ఆ మాయదారి భయపడి ఒక్కసారిగా పైకి లేచి పరుగులు తీయడం ఇందులో చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube