జూలై - 10న జరిగే కార్మికుల కోర్కెల దినోత్సవం ( వర్కర్స్ డిమాండ్స్ "డే" ) ను విజయవంతం చేయండి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల బి.వై.

నగర్ లోని కామ్రేడ్.

అమృత్ లాల్ శుక్లా కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , కార్యదర్శి కోడం రమణ లు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరేసే విధంగా కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చి ఆమలు చేయడం జరుగుతుందని, అలాగే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయడం లేదని దీనివలన అన్ని రంగాలలో పనిచేస్తున్న సంఘటిత - ఆసంఘటిత కార్మికులు , ఉద్యోగులు అందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను డిమాండ్ల రూపములో ప్రభుత్వానికి తెలియజెప్పడంలో భాగంగా జూలై - 10 ఆల్ ఇండియా వర్కర్స్ డిమాండ్స్ "డే" నిరసన - ధర్నా కార్యక్రమాలను చేపట్టాలని సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపు ఇవ్వడం జరిగిందని అందులో భాగంగా రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటుగా వేములవాడ పట్టణాలలో పెద్ద ఎత్తున నిరసన - ర్యాలీ - ధర్నా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమాలలో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి మన డిమాండ్లను తెలియజేయడంలో మీ వంతు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఆల్ ఇండియా వర్కర్స్ డిమాండ్స్ "డే" కార్యక్రమాలు జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాలలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులు ఉదయం 11 గంటల వరకు సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్దకు రావాలని అక్కడినుండి ఆర్డిఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించడం జరుగుతుందని, అదేవిధంగా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల్లో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులు వేములవాడ తెలంగాణ చౌక్ వద్దకు ఉదయం 11 గంటల వరకు రావాలని అక్కడ నుండి ఆర్డీవో ఆఫీస్ వరకు ర్యాలిగా వెళ్లి ధర్నా చేపట్టి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందించడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమాలలో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ , కోశాధికారి అన్నల్దాస్ గణేష్ , జిల్లా కమిటీ సభ్యులు సిరిమల్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇంటర్ లోనే ప్రేమలో పడ్డ... ఆమె పోయాక చనిపోదాం అనుకున్న : చలపతి రావు

Latest Rajanna Sircilla News