రాహుల్ గాంధీ రోడ్ షోను విజయవంతం చేయండి

రాజన్న సిరిసిల్ల జిల్లా :రేపు శుక్రవారం వేములవాడ నియోజకవర్గం మేడిపల్లి మండలానికి రాహుల్ గాంధీ( Rahul Gandhi ) రోడ్ షో మధ్యాహ్నం 12 గంటలకు వస్తున్నందున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర( Bharat Jodo Yatra ) అందరి సమస్య విని రానున్న ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడం జరుగుతుందని వారు అన్నారు.

కాబట్టి రేపు జరిగే రోడ్ షో ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంఘ స్వామి యాదవ్ నాయకులు కనికరపు రాకేష్( Rakesh ), నాగుల రాము గౌడ్, కూరా దేవయ్య, మూల కిషోర్, గుర్రం తిరుపతి, సుగూరి సుధాకర్, కోలాకారి రాజు వస్తాది కృష్ణ గౌడ్, దూలం భూమేష్, నీలం గురవయ్య చిలువేరి శ్రీనివాస్, పల్లపు రాజేందర్ ,ఎర్ర శ్రావణ్, నాగుల మహేష్, బాలు ,అక్కనపల్లి నరేష్, మండే రాజు, తంగెళ్ల గణేష్, షేక్ ఫిరోజ్ పాషా, సాగర్, శేఖర్, తదితరులు ఉన్నారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...

Latest Rajanna Sircilla News