నిరుద్యోగ జంగ్ సైరన్ సభను విజయవంతం చేయండి: పిసిసి వైస్ ప్రెసిడెంట్ పోట్ల

సూర్యాపేట జిల్లా: మే 8 న తెలంగాణలోని నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై జరిగే నిరుద్యోగ నిరసన జంగ్ సైరన్ భారీ బహిరంగ సభను విజయంతం చేయాలని టిపిసిసి ఉపాధ్యక్షులు,మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

గురువారం కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్యా హాజరై మాట్లాడుతూ తెలంగాణకు తొలిసారిగా వస్తున్న ప్రియాంక గాంధీ పర్యటన సందర్భంగా సూర్యాపేట జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు,శ్రేణులు తరలిరావాలని కోరారు.

ప్రియాంక గాంధీ తెలంగాణలో ఉద్యోగుల ఇబ్బందులు,ఆత్మహత్యలు మరియు పేపర్ లీకేజ్ నిరుద్యోగులపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న అంశాలపై ప్రసంగించమన్నారని తెలిపారు.రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ తరహాలోనే యూత్ డిక్లరేషన్ ను ప్రకటిస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు కొప్పుల వేణారెడ్డి,పిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బైరు శైలేందేర్ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి,ధారవత్ వీరన్న నాయక్,కందాల వెంకట్ రెడ్డి,డీసీసీ ఉపాధ్యక్షులు సయ్యద్ ఖమృద్దిన్,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొలగాని బాలు గౌడ్,జిల్లా కార్యదర్శులు రుడ్రంగి రవి,నాగుల వాసు, తదితరులు పాల్గొన్నారు.

కోదాడలో గ్రానైట్ ను తరలిస్తున్న 13 ట్రాలీలు సీజ్
Advertisement

Latest Suryapet News