లాక్‌డౌన్‌ కి రెడీ అవ్వాలి అంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..!!

దేశంలో సగం పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే ఉండటంతో ఇప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తుంది.

ఇటీవల రాత్రి 8 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించడం జరిగింది.

మరోపక్క కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలలో లాక్‌డౌన్‌ విధిస్తోంది.ఇంత కఠినంగా వ్యవహరిస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో .ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ మరోసారి అమలు చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యి అందుకు సంబంధించిన ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

మాస్కు ధరించకుండా బయట కనిపిస్తే ఇప్పటికే భారీ స్థాయిలో జరిమానాలు విధిస్తున్నారు.ఎక్కడికక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయినా గాని కేసులు సంఖ్య పెరిగిపోవటం, వైరస్ విజృంభణ ఆపలేకపోతున్నా నేపథ్యంలో ఖచ్చితంగా మరోసారి లాక్ డౌన్ గ్యారంటీ గా అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నట్లు మీడియా వర్గాలలో వార్తలు వస్తున్నాయి.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు