లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవరెడ్డి కస్టడీ పొడిగింపు

లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవ రెడ్డి కస్టడీ పొడిగింపు అయింది.జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 28వ తేదీ వరకు పొడిగించారు.

ఈ నేపథ్యంలోనే మనీలాండరింగ్ కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని ఈడీ అధికారులు తెలిపారు.ప్రస్తుతం మాగుంట రాఘవరెడ్డి తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

కాగా ఫిబ్రవరి 10న మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇవాళ విచారణకు గైర్హాజరు అయ్యారు.

ఈ క్రమంలోనే ఈడీ విచారణకు రాలేనని ఈడీకి మాగుంట లేఖ రాశారని తెలుస్తోంది.

Advertisement
ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...

తాజా వార్తలు