మహిళల భద్రత విషయంలో సీఎం జగన్ పై సీరియస్ అయిన లోకేష్..!!

సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడప జిల్లాలో మహిళల రక్షణకు దిక్కులేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు.

రాష్ట్రంలో దిశ చట్టం పేరుతో డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఆడ వాళ్లకు న్యాయం చేయడం లేదని మండిపడ్డారు.

కడప జిల్లాలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన లావణ్యకు ప్రభుత్వం సరైన వైద్యం అందించాలి అంటూ సోషల్ మీడియాలో లోకేష్ డిమాండ్ చేశారు.అంతేకాకుండా ఇప్పటినుండి మహిళలపై దృష్టి పెట్టాలని సూచించారు.

మహిళలపై అత్యాచారానికి అఘాయిత్యాలకు పాల్పడుతున్న మృగాలకు కఠినంగా శిక్షలు విధించాలని లోకేష్ డిమాండ్ చేశారు.కడప జిల్లాలో జోళ్ళు లావణ్య(17) అనే అమ్మాయిపై సునీల్ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం జరిగింది.

సునీల్ అనే వ్యక్తి మూడు నెలల నుంచి లావణ్య వెంటపడుతూ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.దీంతో రక్తపు మడుగులో ఉన్న లావణ్యను స్థానికులు ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ చేయడంతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

అయితే వైద్యం విషయంలో లావణ్యకు ప్రభుత్వం నుండి సరైన సహాయం అందడం లేదని లోకేష్ తాజాగా సోషల్ మీడియాలో విమర్శలు చేయటం వైరల్ గా మారింది.

పిఠాపురంలో యూ.ఎస్.ఏ, ఎన్.ఆర్.ఐ సేవలు అభినందనీయం అంటూ నాగబాబు కామెంట్స్..!!
Advertisement

తాజా వార్తలు