54 రూపాయలకే లీటర్ పెట్రోల్.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుతం పెరిగిన పెట్రోల్ ధరలతో సామాన్య ప్రజలు రోడ్డుపైకి వాహనాలతో రావాలంటనే భయపడిపోతున్నారు.మరీ అత్యవసరం అయితే తప్ప బండ్లను బటకు తీయట్లేరు.

కానీ ఈరోజు ఓ చోట్ల వందలాది మంది సామాన్య ప్రజలు వాహనాలతో వచ్చి పెట్రోల్ బంక్ ముందు వేచి చూస్తున్నారు.దీనంతటికీ కారణం అక్కడ లీటర్ పెట్రోల్ కేవలం 54 రూపాయలకు మాత్రమే ఇవ్వడం.

అయితే ఇంత తక్కువ ధరకు ఎందుకు ఇస్తున్నారు, ఇది ఎక్కడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.మహారాష్ట్రలోని నవ నిర్మాణ్ సేవ పార్టీకి చెందిన రాజ్ ఠాక్రే 54వ పుట్టిన రోజు సందర్భంగా.

ఆ పార్టీ కార్యకర్తలు వినూత్న ఆలోచన చేశారు.తమ అభిమాన నాయకుడి పుట్టిన రోజును కేక్ లు కట్ చేయడం, అన్నదానాలు చేయడ, రక్త దానాలు చేయడం కంటే ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు.ఇంకేముంది ఔరంగాబాద్ లోని క్రాంతి చౌక్ పెట్రోల్ బంక్ లో రూ.54కే లీటర్ పెట్రోల్ అందిస్తామని తెలిపారు.దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు, వాహన దారులంతా మంగళ వారం ఉదయం ఆరు గంటల నుంచే పెట్రోల్ బంక్ వద్ద గుమిగూడారు.

Advertisement

ఎలాగైనా సరే సగం ధరకే లీటర్ పెట్రోల్ ను దక్కించుకోవాలనుకున్నారు.దాని కోసం.ఎర్రటి ఎండలో గంటల తరబడి నిల్చున్నారు.

చివరకు చాలా మంది లీటర్ పెట్రోల్ ను సొంతం చేసుకొని ఆనందంగా ఇంటికి వెనుదిరిగారు.ప్రస్తుతం పెట్రోల్ ధర 100 రూపాయలకు పైగా కావడం.

సగం ధరకే పెట్రోల్ ఇస్తామని చెప్పడంతో ఈ వార్త వైరల్ అయింది.

వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్ట్.. ట్రంప్ ప్రకటన
Advertisement

తాజా వార్తలు