సౌత్ మూవీలు @400 కోట్లు.. లిష్టులో ఉన్న సినిమాలు ఇవే!

ఇప్పుడు అందరి టార్గెట్ ఒక్కటే.పాన్ ఇండియా సినిమా.

ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారిపోయింది.

స్టార్ హీరోలు దాదాపు పాన్ ఇండియా స్టార్ లుగా మారిపోతున్నారు.

ఒక పక్క బాలీవుడ్ ఇండస్ట్రీ వరుస ప్లాపులతో సతమతం అవుతుంటే మన సౌత్ మాత్రం వారికీ గుక్కతిప్పుకోకుండా వరుస పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేస్తూ బెంబేలిత్తిస్తున్నారు.దీంతో మన మార్కెట్ 100 కోట్లు ఎప్పుడో దాటి పోయింది.ఇప్పుడు అందరి ఫోకస్ 500 కోట్లు.1000 కోట్ల మీదనే ఉంది.మరి మన సౌత్ సినిమాలు రిలీజ్ అయ్యి 400 కోట్లకు పైగానే కలెక్ట్ చేసిన సినిమాలు ఎన్నో మీకు తెలుసా.

మరి ఇప్పుడు ఆ లిష్టు ఒకసారి తెలుసుకుందాం.

బాహుబలి సిరీస్ :

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రెండు పార్ట్ లు కూడా 500 కోట్లు దాటాయి.పార్ట్ 1 వరల్డ్ వైడ్ గా 650 కోట్లు కలెక్ట్ చేయగా.పార్ట్ 2 ఏకంగా 1810 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు తిరగరాసింది.

2.O :

రజనీ కాంత్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 709 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత కలెక్ట్ చేసిన బడ్జెట్ పరంగా చుస్తే మాత్రం ఇది ప్లాప్ లిష్టులోకి చేర్చాల్సిందే.

Advertisement

సాహో :

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిన కూడా 400 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరి ప్రభాస్ స్టామినా తెలిపింది.

కేజిఎఫ్ 2 :

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ 2 సినిమా వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది.పార్ట్ 1 కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఏకంగా 1200 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులను తిరగరాసింది.

ఆర్ఆర్ఆర్ :

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసారు.ఈ సినిమా ఊహించినట్టుగానే సూపర్ హిట్ అయ్యింది.బాక్సాఫీస్ దగ్గర 1100 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

విక్రమ్ :

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో కమల్ హాసన్ చాలా ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.ఈ సినిమా ఇప్పటికే 400 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరి ఇంకా రన్ అవుతూనే ఉంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఇంకా ముందు ముందు మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది.ఇలా మన సౌత్ సినిమాలు 400 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు