టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ చిత్రం కూడా ఒకటి.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదట్నుండీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా పూరీ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.కాగా ఈ సినిమాను బాలీవుడ్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ పక్కా ప్రణాళికతో దూసుకుపోతుంది.
అయితే ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతున్నా, షూటింగ్ ఇంకా పూర్తికాలేదు.దీంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.
కాగా తాజాగా ఈ సందేహానికి చిత్ర యూనిట్ ఫుల్‌స్టాప్ పెట్టేశారు.లైగర్ చిత్రాన్ని సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఆయన అభిమానులకు ఫుల్ మీల్స్ ఖాయమని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం ఖాయమని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ చూస్తే తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూరీ డైరెక్ట్ చేస్తుండగా, పూరీ కనెక్ట్స్‌పై ఛార్మీతో కలిసి ఆయన స్వయంగా నిర్మిస్తున్నాడు.
కాగా బాలీవుడ్‌లో ఈ సినిమాను కరణ్ జోహర్ రిలీజ్ చేస్తుండటంతో బాలీవుడ్ జనాల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఇతర చిత్రాలతో పోటీ లేకుండా సోలోగా దిగుతుండటంతో లైగర్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.
మరి లైగర్ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సెప్టెంబర్ 9 వరకు ఆగాల్సిందే.