అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై డెమోక్రటిక్ పార్టీ నేతలు పెట్టిన అభిశంసన విచారణ మొదలయ్యింది.అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా అధికారంలో లేని ఓ మాజీ అధ్యక్షుడిపై అభిశంసన పెట్టి మరో సారి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది.
ఇదిలాఉంటే అసలు డెమోక్రాట్లు ట్రంప్ పై అభిశంసన కోసం ఇంతగా పట్టుబట్టదానికి కారణం ఎంటి అంటే పరిశీలకులు మాత్రం ఇది భవిష్యత్త్ వ్యూహంగా అభివర్ణిస్తున్నారు.
ట్రంప్ పై రాజ్యంగ బద్దంగా అభిశంసన పెట్టామని చెప్పిన డెమోక్రటిక్ పార్టీ ఈ మేరకు 56 -44 ఓట్లతో అభిశంసన విచారణ నెగ్గించుకుంది.
రిపబ్లికన్ పార్టీ కి చెందిన దాదాపు ఆరుగురు సభ్యులు అందుకు ఆమోదం తెలిపారు దాంతో 56 ఓట్లు నమోదయ్యాయి.అయితే అమెరికాకు తలమానికంగా నిలిచే క్యాపిటల్ భవనంపై దాడికి పూర్తి భాద్యత డోనాల్డ్ ట్రంప్ దేనని అమెరికా ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం, ట్రంప్ కు రిపబ్లికన్ పార్టీ నేతలు మద్దతు పలకడం ద్వారా ఆ పార్టీ ఎలాంటి తప్పులు చేస్తుందో ప్రజలకు తెలియజేయడమే పరమావదిగా ఈ అభిశంసన సాగనుంది.
ఈ ప్రయత్నం ద్వారా.

రిపబ్లికన్ పార్టీపై ప్రజలకు వెగటు కలిగించే ప్రయత్నం చేసి తద్వారా భవిష్యత్ రాజకీయాలలో లబ్ది పొందే ప్రయత్నం చేయనుందట.ఇదిలాఉంటే ఈ అభిశంసన తీర్మానం సెనేట్ లో నెగ్గే అవకాశాలు లేవని అంటున్నారు పరిశీలకులు ఎందుకంటే.100 మంది సెనేట్ సభ్యులు ఉన్న ఈ సభలో దాదాపు 67 మంది అభిశంసనకు అనుకూలంగా ఓట్లు వేస్తేనే తీర్మానం ఆమోదించబడుతుంది.కానీ సభలో డెమోక్రటిక్ పార్టీ బలం 50 కాగా ట్రంప్ ని వ్యతిరేకిస్తున్న సొంత పార్టీ నేతల ఓట్లు 6 ఉన్నాయి అంటే మొత్తం 56 అవుతున్నా ఇంకా 11 ఓట్లు కావాల్సి ఉంటుంది.ఏది ఏమైనా డెమోక్రాట్లు పెట్టె అభిశంసన వీగిపోవడం ఖాయం అంటున్నారు.
ఈ విషయం డెమొక్రాట్లకు కూడా తెలిసినా కేవలం అమెరికా ప్రజలలో రిపబ్లికన్ పార్టీపై వ్యతిరేకత తెచ్చే ప్రయత్నమేననేది విశ్లేషకుల వాదన.