చాణక్య నీతి: ధనలక్ష్మి కరుణ కురిపించే 5 విషయాలు!

చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం ధనవంతులు కావాలనే కోరిక అందరిలో ఉంటుంది.ధనం సంపాదించడానికి అందరూ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు.

ఈ కలియుగంలో డబ్బు అనేది ప్రధాన వనరుగా మారిపోయింది.ఆచార్య చాణక్యుని విధానాల ప్రకారం సంపదకు ప్రధాన దేవత లక్ష్మిదేవి.

Laxmi Ji Likes Cleanliness Money Comes , Laxmi Ji , Laxmi Devi , Money Comes ,

అమ్మవారి అనుగ్రహం దక్కినప్పుడే జీవితంలో సంపద లభిస్తుంది.చాణక్యనీతిలో తెలిపిన వివరాల ప్రకారం ధనలక్ష్మిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ ఐదు పనులు అస్సలు చేయకూడదు.

ఈ పనులు చేస్తే ధనలక్ష్మి అక్కడ నిలిచివుండదు.

అపరిశుభ్రతకూ దూరం

చాణక్యనీతి విధానం ప్రకారం, లక్ష్మిదేవికి పరిశుభ్రత అంటే ఎంతో ఇష్టం.

Advertisement

పరిశుభ్రత పాటించని ప్రదేశానికి లక్ష్మిదేవి అస్సలు వెళ్లదు.ఆరోగ్యానికి పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.

ఆరోగ్యం కోసం పరిశుభ్రతా నియమాలను తప్పక పాటించాలి.ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అన్ని పనులను సులభంగా పూర్తి చేయగలుగుతాడు.

అలాంటివారు ఉత్సాహంగా ఉంటారు.

డబ్బు వృథా తగదు

డబ్బును ఎటువంటి పరిస్థితులలోనూ వృథా చేయకూడదని చాణక్య నీతి చెబుతోంది.

అనవసరంగా డబ్బు ఖర్చు చేసేవారెవరైనా వారి దగ్గర లక్ష్మిదేవి నిలచివుండదు.

దుస్సాగత్యం కూడదు

మీకు ధనలక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే సత్సాంగత్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చాణక్యనీతి చెబుతోంది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. పైచేయి సాధించిన అమ్మాయిలు..!

దుష్టులతో సహవాసం చేస్తే అది మనిషి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Advertisement

అందుకే దుస్సాంగత్యాన్ని తక్షణం విడిచిపెట్టాలి.

అత్యాశ వద్దు

చాణక్యుని విధానాలలోని వివరాల ప్రకారం డబ్బుపై అత్యాశ కలిగినవారు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని ఎన్నటికీ పొందలేరు.

కష్టపడి పనిచేసేవారు, నీతినియమాలు, క్రమశిక్షణ కలిగిన వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం కురుస్తుంది.

అహంకారం వీడాలి

అహంకారం కలిగివున్న వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదని చాణక్య నీతి స్పష్టం చేస్తోంది.

వినయవిధేయతలు, మధురమైన మాటలు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనవి.అలాంటి వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కురిపిస్తుంది.

అహంకారంతో జీవించే వారు నిరంతరం ఇబ్బందులను చూడాల్సి వస్తుంది.అలాంటి వారికి సమాజంలో గౌరవం దొరకడం కష్టం.

తాజా వార్తలు