ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణల నుంచి రామ్ చరణ్ మహేష్ బాబు ల ప్రతి ఒక్కరూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
అలాగే మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా విడుదల కాగానే తన తదుపరి సినిమాపై ద్రుష్టిని పెట్టాడు మహేష్ బాబు.అలాగే హీరో రామ్ చరణ్ కూడా ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత మరొక సినిమాపై దృష్టి పెట్టాడు.
ఈ ముగ్గురు హీరోలు ఏఏ సినిమాల్లో నటిస్తున్నారు, ఆ సినిమా దర్శక నిర్మాతలు ఎవరు, హీరోయిన్లు ఎవరు అన్న వివరాలు తెలిసినప్పటికీ ఆ సినిమా టైటిల్ ఏంటి అనేది చెప్పకుండా అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతున్నారు దర్శకనిర్మాతలు.ప్రేక్షకులకు ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది చెప్పకుండా సరైన సమయంలో వాటిని ప్రకటించడానికి వేచి చూస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలకు సంబంధించిన టైటిల్స్ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి అవేమిటంటే.బాలకృష్ణ హీరోగా ఎన్బీకే 107 వర్కింగ్ టైటిల్ తో గోపీచంద్ మలినేని ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

అందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.తప్పు అయితే ఈ సినిమాకు అన్నగారు అన్న పేరును ఖరారు చేయబోతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించినప్పటికీ ఆ తర్వాత టైటిల్ ను మార్చి జై బాలయ్య అనే పేరుతో టైటిల్ ఉండబోతోంది అని తెలుస్తోంది.అలాగే శంకర్,రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు వర్కింగ్ టైటిల్ ఆర్సీ 15. ఇందులో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే గతంలో ఈ సినిమాకు సర్కారోడు అనే పేరును పెట్టినట్లు వార్తలు వినిపించాయి.

కానీ ఆ పేరును మార్చి ఇప్పుడు అధికారి అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
గతంలో ఈ సినిమాకు పార్ధు అనే టైటిల్ ను ఖరారు చేయగా దానిని మార్చి ఇప్పుడు అర్జున్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.