కుంతి కోసం పాండవులు నిర్మించిన శివాలయం ఎక్కడ ఉందో తెలుసా?

మన దేశంలో ఎన్నో ప్రసిద్ది చెందిన శివాలయాలు నిర్మించబడి ఉన్నాయి.

అయితే అన్ని శివాలయాలలో కన్నా అతి పెద్ద శివలింగం కలిగినటు వంటి ఆలయం భోజేశ్వర్ ఆలయం.

ఆలయంలో కొలువైన శివుడు మన భారతదేశంలోనే ఎత్తైన శిఖరంగా ప్రసిద్ధి చెందింది.అదే విధంగా పాండవులు తన తల్లి కుంతి కోసం ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి.

మరి ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.పురాణాల ప్రకారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని భోజ్పూర్ లో ఈ ఆలయం నిర్మించబడి ఉందని తెలుస్తోంది.

ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన శివలింగాన్ని పాండవులు ప్రతిష్టించారని, ఈ శివలింగానికి నిత్యం భీముడు పూజలు నిర్వహించేవారు.ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం ఒకే రాతితో నిర్మించడం ఈ ఆలయ విశేషమని చెప్పవచ్చు.ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన లింగం ఎత్తు 7.5 అడుగులు ఉండటం చేత భీముడు శివలింగంపై మోకాళ్లపై కూర్చుని పువ్వులను సమర్పించేవారు.

Largest Ancient Shiva Lingam In The World Shiva Lingam, Largest Shiva Lingam, Ma
Advertisement
Largest Ancient Shiva Lingam In The World Shiva Lingam, Largest Shiva Lingam, Ma

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ భోజేశ్వర్ ఆలయ నిర్మాణం ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది.అయితే ఈ విధంగా ఆలయం అసంపూర్తిగా ఉండటానికి గల కారణం ఇప్పటికీ ఎవరికీ తెలియదు.అదేవిధంగా ఈ ఆలయంపై ఆలయానికి సంబంధించిన ఎటువంటి చరిత్ర లేకపోవటం గమనార్హం.

పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించారనీ పురాణాలు చెబుతున్నాయి.అదేవిధంగా ద్వాపర యుగంలో ఒకరోజు రాత్రి కుంతీ ఆరాధన కోసం పాండవులు ఈ ఆలయం నిర్మించారని తెల్లవారగానే పాండవులు అదృశ్యమవడం వల్లనే ఈ ఆలయం అసంపూర్తిగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఆలయం పక్కనే బెత్వా నది ప్రవహిస్తుంది.ఈ ఆలయంలోనే కుంతీదేవి కర్ణుడిని విడిచిపెట్టినట్లు చెబుతారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు