అందుకే పద్దతిగల కుటుంబాల నుంచి అమ్మాయిలను సినీ పరిశ్రమకు పంపరు....

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి మా టీవీలో ప్రసారమయ్యే "లక్ష్మీ కళ్యాణం" అనే ధారావాహిక ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన "టాలీవుడ్ ప్రముఖ సీరియల్ హీరోయిన్ హర్షిత" గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

కాగా తాజాగా హర్షిత ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని బుల్లితెర పరిశ్రమలో ఉన్నటువంటి కష్టసుఖాల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

అంతేకాకుండా సినిమా పరిశ్రమకి ఆ కారణాల వల్లే కొందరు కుటుంబ సభ్యులు తమ పిల్లలని పంపరని  సంచలన వ్యాఖ్యలు చేసింది.అయితే తాను సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో అందరిలాగే అవకాశాలకోసం బాగానే ఎదురు చూశానని చెప్పుకొచ్చింది.

దీనికితోడు తనకు ఇక్కడికి వచ్చిన కొత్తలో తెలుగు సరిగ్గా మాట్లాడడం రాకపోవడం కూడా కొంతమేర మైనస్ అయిందని దాంతో కష్టపడి తెలుగు భాషను స్పష్టంగా మాట్లాడటం నేర్చుకున్నానని తెలిపింది.కానీ బుల్లితెర ప్రేక్షకులు తనని ఎంతగానో ఆదరించారని అందుకుగాను వారికి ఎంతో రుణపడి ఉన్నానని సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

Lakshmi Kalyanam Serial Actress Harshitha Sensational Comments On Upcoming Artis

అయితే సినిమా పరిశ్రమలో నటీనటులు పడేటువంటి  కష్టాలు బయట వాళ్ళకి చాలా సులభంగా కనిపిస్తాయని కానీ నటీనటులు మరియు ఆర్టిస్టులు ఇతర సహాయ సిబ్బంది ఎదుర్కునే కష్టాలు తెలిస్తే కన్నీళ్లు వస్తాయని ఎమోషనల్ అయ్యింది. అయితే ఉదాహరణగా ఒక ధారావాహికలో నటించిచేటువంటి నటీనటులు జీతభత్యాలు మరియు ఇతర ఆర్టిస్టుల జీతభత్యాలు మొత్తం ఈ ధారావాహిక పైనే ఆధారపడి ఉంటాయని ఒకవేళ ధారావాహిక సరిగ్గా ప్రేక్షకులను అలరించలేకపోతే దర్శక నిర్మాతలతో పాటు చాలా మంది ఆర్టిస్టులు ఉపాధిని కోల్పోతారని తెలిపింది.ఇక సినిమా పరిశ్రమ కి ఎవరైనా తమ పిల్లలు వెళతామంటే కొందరు కుటుంబ సభ్యులు వారిని అస్సలు ప్రోత్సహించరని కానీ సినిమా పరిశ్రమ గురించి తెలిసిన వారు ఇలా చేయాలని తెలిపింది.

Advertisement
Lakshmi Kalyanam Serial Actress Harshitha Sensational Comments On Upcoming Artis

అంతేగాక ఎవరో చేసినటువంటి కొంతమంది తప్పులను చూపిస్తూ మొత్తం సినిమా పరిశ్రమ గురించి తప్పుగా అనుకోవడం సరి కాదని తెలిపింది.అందువల్లే పద్ధతిగల కుటుంబాల నుంచి ఆడపిల్లలను సినిమా పరిశ్రమకు పంపించాలంటే తల్లి దండ్రులు అభ్యంతరాలు తెలుపుతున్నారని దీనివల్ల తమ పిల్లల కలలను కాలరస్తున్నరని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అంతేకాక బయట ఎలాగైతే ఉద్యోగం చేస్తే డబ్బులు ఇస్తారో సినిమా పరిశ్రమలో కూడా కష్టపడి పని చేస్తే అలాగే డబ్బులు ఇస్తారని కాబట్టి బయట ఉద్యోగానికి సినిమా పరిశ్రమలో పని చేయడానికి పెద్దగా తేడా లేదని చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు