ఎన్నికలలో పోటీ చేయను...ఖుష్బూ.

ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పర్వం మొదలైంది.ఇక ఈ ఎన్నికలలో తామే గెలుస్తామని ఓపక్క డీఎంకే మరోపక్క ఏ.

డి.ఎమ్.కే కాన్ఫిడెంట్ గా చెబుతున్నాయి.ఇక సౌత్ లో పాగా వేయాలని భావిస్తున్న బిజేపికి ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి.

ఇక తమిళనాడులో పవర్ ఫుల్ లేడిగా పేరున్న జయలలిత మరణానంతరం జరుగుతున్న తొలి ఎన్నికల ప్రక్రియ ఇది.ఇక ఈ ఎన్నికలలో అధికార పార్టీ ఏ.డి.ఎమ్.కే ఏ మేర రాణిస్తుందో చూడాలి.ఈసారి ఎన్నికలకు తాను ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకి వెళ్లడానికి కమల్ హాసన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

అందుకోసం ఆయన మిగతా ప్రాంతీయ పార్టీల మాదిరిగా మైనారిటీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు.మరి ఇది కామన్ వెల్త్ మరియు ఆయన పార్టీకి ఏ మేర విజయాన్ని కట్టబెడుతుందో వేచి చూడాలి.

ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం రాష్ట్రంలోని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అలాగే సోషల్ మీడియాలో హీరోయిన్ ఖుష్బూ కు సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతుంది.మరి దాని కథేంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

కన్యాకుమారి ఎంపీ వసంత్‌కుమార్‌ మరణంతో ఖాళీయైన ఆ స్థానం నుండి ఎన్నికలలో బరిలోకి దిగడానికి కాంగ్రెస్ అధికారి ప్రతినిధి ఖుష్బూ ప్రయత్నిస్తున్నారని ఈ విషయంపై పార్టీ కూడా సానుకూలంగానే ఉందని.గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇక తాజాగా దీనిపై స్పందించిన ఖుష్బూ ప్రతిసారి ఎన్నికల ముందు ఇలాంటి వార్తలు రావడం సహజంగా మారిందని అలాగే ఎంపీ వసంత్‌ కుమార్‌ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటని ఆమె పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు