టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం... నేటి నుంచి సెల్ ఫోన్లు నిషేధం అమలు

టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది.ఇవాళ్టి నుంచి టీఎస్పీఎస్సీలో సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ ల‌పై నిషేధం అమల్లోకి రానుందని తెలుస్తోంది.

హైదరాబాదులో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది.ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

Key Decision Of TSPSC... Implementation Of Ban On Cell Phones From Today-టీ�

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్య‌వ‌హారంపై సిట్ ఇచ్చిన నివేదికపై ప్రధానంగా చర్చిస్తున్నార‌ని తెలుస్తోంది.అనంత‌రం దీనిపై ఉద్యోగులకు కమిషన్ కీలక సూచనలు చేయనుంది.

అదేవిధంగా వచ్చే నెలలో జరిగే పరీక్షల పై కూడా టీఎస్పీఎస్సీ కమిషన్ చర్చిస్తోంది.అభ్యర్థుల ఫిర్యాదు కోసం ప్రత్యేకమైన ఆన్ లైన్ వ్యవస్థను బలోపేతం చేసే విధంగా పలు నిర్ణయాలు తీసుకోనుంది.

Advertisement

ఇటీవ‌ల ప‌రిణామాల నేప‌థ్యంలో మరో రెండు పరీక్షలు రద్దు చేయ‌డంతో పాటు మరో రెండు పరీక్షలు వాయిదా వేసే అవకాశం ఉంద‌ని స‌మాచారం.

తెలంగాణలో షాకింగ్ సీన్.. కోళ్ల పంజరంలో పిల్లలు.. ఎలా తీసుకుపోతున్నారో చూడండి..
Advertisement

తాజా వార్తలు