రేపటి నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి గులాబీ బాస్..!!

త్వరలో పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections ) జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్( KCR ) ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఈ మేరకు రేపటి నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

కేసీఆర్ రేపటి నుంచి బస్సు యాత్ర( Bus Yatra ) నిర్వహించనుండగా.ఇందుకోసం పార్టీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు.

KCR For The Parliamentary Election Campaign From Tomorrow Details, BRS President

ఈ క్రమంలోనే ప్రచార రథానికి తెలంగాణభవన్ లో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు.రేపు మిర్యాలగూడ,( Miryalaguda ) సూర్యాపేట( Suryapet ) నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది.

దాదాపు 17 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రలో భాగంగా మొత్తం 21 ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు.మే 10వ తేదీ వరకు బస్సు యాత్ర కొనసాగనుంది.

Advertisement

ఈ యాత్రలో భాగంగా రోడ్ షోలతో పాటు భారీ బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.అయితే రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలని బీఆర్ఎస్ భావిస్తోన్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో షాకింగ్ సీన్.. కోళ్ల పంజరంలో పిల్లలు.. ఎలా తీసుకుపోతున్నారో చూడండి..
Advertisement

తాజా వార్తలు