ప్రజల్లోకి రారు పార్టీని పట్టించుకోరు ఇలా అయితే ఎలా కేసీఆర్ 

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR )వైఖరి ఏమిటి అనేది ఆ పార్టీ నేతలకు అంతుపట్టడం లేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ సైలెంట్ అయ్యారు.

ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోవడం కేసీఆర్ కు మరింత నిరాసే కలిగించింది.  ఇక అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు.

అసలు తెలంగాణ అసెంబ్లీలో( Telangana Assembly ) అడుగు పెట్టేందుకు కేసిఆర్ ఇష్టపడలేదు.  కేవలం ఒకే ఒక్క రోజు అసెంబ్లీకి వచ్చారు.

  మళ్లీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగానే ఉన్నారు .పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరిపోతున్నా కేసీఆర్ మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు.  అప్పుడప్పుడు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలతో తన ఇంట్లోనే సమావేశం అవుతూ,  పార్టీని వీడి వెళుతున్న వారిని ,  వీడేందుకు సిద్ధమవుతున్న వారిని పిలిచి బుజ్జగించి చర్చలు జరపడం చేస్తున్నారు తప్పించి,  జనాల్లోకి వచ్చి పార్టీని మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి బలవపేతం చేసి, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను జనాల్లోకి తీసుకువెళ్లే విషయం పైన కెసిఆర్ దృష్టి సారించకపోవడం ఆ పార్టీ నేతల్లో నిరాశ కలిగిస్తోంది .

Advertisement

అసలు కేసీఆర్ పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోకపోవడం , జనాల్లోకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం వంటివన్నీ చర్చనీయాంశంగా మారాయి .ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ బయటకు వచ్చినా చేసేదేమీ లేదని,  అనవసర ఖర్చు అనే అభిప్రాయం కొంతమంది నేతల్లో ఉండగా,  కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి జనాల్లోకి రావాలని , ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తే పార్టీకి మంచి మైలేజ్ రావడంతో పాటు,  వలసలకు బ్రేక్ పడతాయని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలపై దూకుడు ప్రదర్శిస్తోంది.

ముఖ్యంగా రైతు రుణమాఫీని అమలు చేసింది అయితే ఈ రుణమాఫీ కొంతమందికే దక్కడం,  చాలా మందికి ఇంకా రుణమాఫీ కాకపోవడం తో,  వారు ఆందోళనలకు దిగుతున్నారు.

దీంతో కేసిఆర్ ఈ సమయంలో బయటకు వచ్చి రైతులకు అండగా నిలబడి,  వారి తరఫున పోరాటం చేస్తే అటు జనాల్లోనూ,  ఇటు పార్టీ క్యాడర్ లోనూ ధీమా పెరుగుతుందని , అది అంతిమంగా బీఆర్ఎస్ కు కలిసి వస్తుందని సూచిస్తున్నార.  కేసీఆర్ మాత్రం ఇప్పట్లో జనాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్,  హరీష్ రావులే చక్కబెడుతున్నారు.

జనసేన సరికొత్త రికార్డ్ .. వారంలో 14 లక్షలు 
Advertisement

తాజా వార్తలు