బిజెపిలో బీఆర్ఎస్( BRS ) విలీనం కాబోతోంది అనే వార్తలు చాలా కాలంగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తూనే ఉన్నాయి.దీనికి తగ్గట్లుగానే బీఆర్ఎస్ కూడా ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశం గా మారింది.
కొద్దిరోజుల క్రితం హరీష్ రావు( Harish Rao ) ఢిల్లీకి వెళ్లడం, దాదాపు వారం రోజులపాటు అక్కడే మకాం వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) వ్యవహారంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కలవకుంట్ల కవితకు బెయిల్ ఇప్పించేందుకే ఈ ఇద్దరూ ఢిల్లీకి వెళ్లినట్లుగా ప్రచారం జరిగినా.
తెరవెనుక మాత్రం రాజకీయ కోణంలోనే ఢిల్లీకి వెళ్లారని, బీఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరిగింది.తాజాగా మరోసారి కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీకి వెళ్లడంతో వారు ఢిల్లీ పర్యటన వెనుక కారణాలు ఏమిటి ? ఎవరిని కలిసేందుకు వెళ్లారు అనేది ప్రాధాన్యం సంతరించుకుంది.లిక్కర్ స్కాం వ్యవహారంలో కవితకు బెయిల్ వచ్చేలా చేసేందుకు వీరిద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, బిజెపితో ఒప్పందం చేసుకునేందుకు హరీష్ , కేటీఆర్ లు ఢిల్లీకి వెళ్లినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం బంగ్లాదేశ్( Bangladesh ) పరిణామాలతో పాటు , ఇతర రాజకీయాలతో బిజెపి పెద్దలు బిజీగా ఉండడంతో, కేటీఆర్ , హరీష్ ( KTR, Harish )లు బిజెపి పెద్దల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని, మొత్తంగా బిజెపిలో బీఆర్ఎస్ ను విలీనం చేసేందుకే సిద్ధమయ్యారనే వార్తలు తెలంగాణ ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.దీనికి తగ్గట్లుగానే కేసీఆర్ బిజెపి విషయంలో వ్యవహరిస్తున్న తీరు , పూర్తిగా కాంగ్రెస్ నే టార్గెట్ చేసుకుని బిజెపి పై పెద్దగా విమర్శలు చేయకపోవడం వంటివన్నీ వీటికి బలం చేకూర్చుతున్నాయి.

కవిత అరెస్టు విషయంలో కెసిఆర్ పెద్దగా మాట్లాడకపోవడం, బీజేపీ , బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని కవితను అరెస్టు చేయించిందనే విషయంపై ప్రజల్లోకి వచ్చి పోరాటం చేసే విషయంలో గాని , బిజెపిని ఇరుకున పెట్టే అంశాన్ని గాని పరిగణలోకి తీసుకోకుండా సైలెంట్ అవడం వెనుక కారణాలు ఇవే అన్న ప్రచారం జరుగుతోంది.







