రెండిటికీ చెడ్డ రేవడిలా తయారయింది హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు కౌశిక్ రెడ్డి పరిస్థితి .
మొన్నటి వరకు కాంగ్రెస్ లో బలమైన నేతగా ఉండడంతోపాటు, హుజురాబాద్ నుంచి ఈటెల రాజేందర్ పై పోటీ చేసే వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
యువకుడు , చురుకైనవాడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కౌశిక్ ఈటల రాజేందర్ ను ఓడించగలడు అనే నమ్మకంతో కాంగ్రెస్ శ్రేణులు అంతా ఉండగా, ఒకే ఒక్క ఫోన్ కాల్ కౌశిక్ రాజకీయ భవిష్యత్తును డైలమాలో పడేసింది.ఆయన టిఆర్ఎస్ లో చేరే ఉద్దేశంలో ఉన్నారని గత కొంత కాలంగా ప్రచారం అవుతున్నా, బహిరంగంగా కౌశిక్ మాత్రం స్పందించలేదు .అయితే ఓ ఫోన్ సంభాషణలో టిఆర్ఎస్ టికెట్ తనకే కన్ఫామ్ అయ్యింది అని పార్టీలో చేరబోతున్న ఆయన మాట్లాడడంతో పెద్ద దుమారమే రేగింది .ఈ వ్యవహారంపై కాంగ్రెస్ షోకాజ్ నోటీసు ఇవ్వడంతో పాటు , ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు.వెంటనే కౌశిక్ కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే టిఆర్ఎస్ లో చేరే విషయంలో ఆయన ఇంకా తర్జనభర్జన పడుతున్నారు.హుజురాబాద్ అభ్యర్థిగా తనకు టిక్కెట్ ఇచ్చేందుకు టిఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపితే ఆ పార్టీలో చేరాలని ఆయన చూస్తున్నారు.
అసలు టిఆర్ఎస్ టికెట్ వస్తుందన్న నమ్మకంతోనే మూడు రోజుల్లో తాను ఏ నిర్ణయం తీసుకోబోతున్నానో చెబుతానంటూ కౌశిక్ చెప్పారు.ఇప్పటికే రెండు రోజులు గడుస్తున్నా ఇంకా ఆయన మనస్సులో ఏముందో అనేది తెలియడం లేదు.
అయితే టిఆర్ఎస్ నుంచి టిక్కెట్ హామీ లభించకపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు అనే వాదనలు తెరపైకి వచ్చాయి.
ఒకవేళ టిఆర్ఎస్ కనుక టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తే ఆయన ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది.మరోవైపు తెలంగాణ లో కొత్తగా ఆవిర్భవించిన వైఎస్సార్ టిపీలో చేరుతారని, ఈ మేరకు షర్మిల నుంచి ఆహ్వానం అందినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే హుజూరాబాద్ నియోజకవర్గం లో షర్మిల పార్టీకి పెద్దగా ఆదరణ ఉండదని, ఆ పార్టీలో చేరే కంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయడమే బెటర్ అన్న ఆలోచనలో కౌశిక్ రెడ్డి ఉన్నట్లు సమాచారం.
ఏది ఏమైనా ఒక ఫోన్ కాల్ కౌశిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టినట్టు గా కనిపిస్తోంది.ఫోన్ ఆడియో బయటకు రాకపోతే టిఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన పేరు తెరపైకి వచ్చి ఉండేదని, కానీ ఇప్పుడు టికెట్ హామీ వస్తుందో లేదో తెలియక కౌశిక్ ఆందోళనలో ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy