వైరల్ ఫోటో : ఒకే చోట ప్రపంచంలోని అత్యంత పొట్టి , పొడవైన మహిళలు

ప్రస్తుత రోజులలో ప్రపంచాన్ని ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరికీ ఇట్టే తెలిసిపోతుంది.

ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

ఇంతకీ ఆ ఫోటోలో ఏముందన్న విషయానికి వస్తే.ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ.

( Worlds Tallest Woman ) అత్యంత పొట్టి మహిళ( Worlds Shortest Woman ) ఇద్దరు కూడా ఓకే ఫ్రేమ్ లో లండన్ టవర్ బ్రిడ్జి ముందు నిల్చోని ఫోటో దిగారు.ఈ క్రమంలో వారి ఇద్దరి ఫోటోలు వీడియోలను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ వారు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.

వీరిద్దరూ కలిసిన సందర్భంగా టీ తాగడంతో పాటు పిజ్జా కూడా తిన్నారు.

Jyoti Amge And Rumeysa Gelgi Adorable Moment Worlds Shortest And Tallest Women M
Advertisement
Jyoti Amge And Rumeysa Gelgi Adorable Moment Worlds Shortest And Tallest Women M

ఇక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ అయినా రుమేశా గెల్గి( Rumeysa Gelgi ) టర్కీకి చెందిన అమ్మాయి.ఆమె ఎత్తు ఏడడుగుల కంటే ఎక్కువ.వాస్తవానికి ఆమె వీవర్ సిండ్రోమ్ అనే అరుదైన పరిస్థితి కారణంగా ఆ మహిళ ఎత్తు ఏడు అడుగుల 7 అంగుళాలకు చేరుకుంది.

ఈ క్రమంలో ఆమె అత్యంత ఎత్తైన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సొంతం చేసుకుంది.అలాగే రుమేశా గెల్గి ఎత్తు, వీవర్ సిండ్రోమ్ కారణంగా ఎక్కువగా వీల్ చైర్ కే పరిమితమై ఉంటుంది.

Jyoti Amge And Rumeysa Gelgi Adorable Moment Worlds Shortest And Tallest Women M

ఇక మరోవైపు ప్రపంచంలోనే అతి చిన్న మహిళ జ్యోతి అమ్గే( Jyoti Amge ) విషయానికి వస్తే.ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి భారత్ లోని మహారాష్ట్రలోని నాగపూర్ లో నివాసం ఉంటుంది.జ్యోతి ఎత్తు విషయానికి వస్తే.

ఆవిడ రెండు అడుగులు మాత్రమే.ఈమె కూడా అకోండ్రోప్లాసియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది.

అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
తగ్గేదెలా.. వెస్టిండీస్ బౌలర్ పై కాలు దువ్విన యువరాజ్ సింగ్

అకోండ్రోప్లాసియా వ్యాధి సాధారంణగా మరుగుజ్జును కలగజేస్తుంది.జ్యోతికి పెళ్లిపై ఇష్టం లేకపోవడంతో ఒంటరిగా జీవించాలని నిర్ణయం తీసుకుంది.

Advertisement

ఇకపోతే, జ్యోతి అకోండ్రోప్లాసియా వ్యాధి కారణంగా ఎత్తు పెరగడానికి వీలు అవ్వదు.జ్యోతి అమ్గే సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు తన జీవితానికి సంబంధించిన వీడియోలను అందరితో పంచుకుంటుంది.

అలాగే ఆమె బాలీవుడ్ పలు కార్యక్రమంలో కనపడిస్తుంది కూడా.

తాజా వార్తలు