నెట్టింట వైరల్ గా మారిన ఎన్టీఆర్ న్యూ లుక్..!

నందమూరి వారసుడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మాస్ విత్ యాక్షన్ సినిమాలతో తన అభిమానులను అలరిస్తున్నాడు.

కరోనా కారణం వల్ల ప్రేక్షకులకు దూరంగా ఉన్న ఎన్టీఆర్, ప్రస్తుతం తన సరికొత్త లుక్ లో ఉన్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారి తన అభిమానులను ఆకట్టుకుంటోంది.ఈ ఫోటో చూసిన తన అభిమానులు ఎన్టీఆర్ ఏదైనా కొత్త సినిమా చేస్తున్నాడా? అన్న ఆలోచనలో పడ్డారు.అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం నిర్వహిస్తున్న ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం ఆర్ఆర్ఆర్ లో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్న విషయం అందరికీ తెలిసినదే.అయితే ఇందులో మరో అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు.

అయితే ఇప్పటికే చరణ్ చేసిన అల్లూరి సీతారామరాజు టీజర్ ను విడుదల చేయడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని చిత్ర బృందం భావించారు.అయితే దసరా కానుకగా అక్టోబర్ 22న ఎన్టీఆర్ నటించిన కొమరం భీమ్ టీజర్ ను విడుదల చేయాలనే ఆలోచనలు రాజమౌళి ఉన్నట్లు సమాచారం.

Advertisement

ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది.అయితే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎన్టీఆర్ అభిమానులను, ఇటు చరణ్ అభిమానులను అలరించనుందని, చిత్ర బృందం తెలిపారు.

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో ఉన్న ఈ ఫోటో మాత్రం ఓ వాణిజ్య ప్రకటన కు సంబంధించిన ఫోటో గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఈ ఫోటోలో ఎన్టీఆర్ తన తీక్షణమైన చూపులు తన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

చాలా రోజుల తర్వాత తన అభిమాన హీరో సరికొత్త లుక్ తో కనిపించడంతో ఒక్కసారిగా తన అభిమానులు ఎంతగానో సంబరపడిపోతున్నారు.

Hair winter : వింటర్ లో ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవాల్సిందే.. మిస్ అయితే చాలా నష్టపోతారు!
Advertisement

తాజా వార్తలు