తడగొండలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం కావడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి టోర్నమెంట్ విన్నర్ ప్రైజ్ మనీ స్పాన్సర్ గ్రామ సర్పంచ్ చిందం రమేష్ కి రన్నర్ ఆఫ్ ప్రైజ్ మనీ స్పాన్సర్ గ్రామ ఉపసర్పంచ్ చేపూరి వరలక్ష్మి కనకయ్య కి టోర్నమెంట్ ముందుకు సాగడానికి సహకరించిన దాతలకు గ్రామ ప్రజలందరికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

చివరి పోరులో చింతకుంట ,కోరేం పోటీపడగా ఉత్కంఠ భరితంగా సాగినమ్యాచ్ లో చింతకుంట విన్నర్, కోరేం రన్నర్ గా నిలవడం జరిగింది.

తదనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్, మెంబెర్ డా.చెన్నాడి అమిత్ కుమార్ ముఖ్య అధితులుగా హాజరై మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషమని ఇట్టి నిర్వాహకులు విజయవంతంగా ముగించినందుకు నిర్వాహకులను అభినందించారు దాతలు ముందుకు వచ్చి యువతను ప్రోత్సహించడం చాలా అభినందనీయమని అన్నారు .ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ చిందం రమేశ్, ఉప సర్పంచ్ చేపురి వరలక్ష్మీ కనకయ్య , ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ ,వార్డుసభ్యులు కో ఆప్షన్ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ,బొమ్మేన రాదా కిషన్ రావు, మండల కో ఆప్షన్ సభ్యులు అజ్జు మహ్మద్ , మండలం భారాసా యూత్ వింగ్ ప్రెసిడెంట్ కట్ట గోవర్ధన్ గౌడ్ ,భారాసా గ్రామ శాఖ అధ్యక్షులు బత్తిని కమల్ గౌడ్, నాయకులు చేపురి కనకయ్య, కాడే భాస్కర్ , ముదాం శ్రీనివాస్ ,చేపురి వెంకటేష్, మండల శ్రీనివాస్,ఇరు జట్ల క్రీడాకారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

నాగ చైతన్య కి అదే మైనస్ గా మారుతుందా..?

Latest Rajanna Sircilla News