ప‌రువు నిలుపుకున్న జ‌న‌సేన‌.. అందువ‌ల్లే ఎక్కువ సీట్లు రాలేద‌ట‌..

వైసీపీ దెబ్బ‌కు టీడీపీ లాంటి ఘ‌న చరిత్ర ఉన్న పార్టీనే ఢీలా ప‌డిపోయింది.అలాంటిది జ‌న‌సేన మాత్రం అంతో ఇంతో ప‌రువు నిలుపుకునే ప్ర‌య‌త్నం చేసింది.

త‌న స్థాయికి త‌గ్గ పోటీ ఇవ్వ‌లేక‌పోయినా కూడా ప‌రువు నిలుపుకుంద‌నే చెప్పొచ్చు.ఎందుకంటే ఎక్క‌డా ఎమ్మెల్యేలు కూడా లేకుండానే పరిషత్ ఎన్నికల్లో కొంద‌రు జ‌న‌సేన త‌ర‌ఫున పోటీ చేసినప్పటికీ అంద‌రూ గెల‌వ‌లేక‌పోయారు.

కాగా ఇందులో కొందరు మాత్ర‌మే గెలుపు సాధించారు.ఇక ఓవరాల్‌గా 177 ఎంపీటీసీ స్థానాల‌ను, అలాగే రెండు జడ్పీటీసీ స్థానాల‌ను జ‌న‌సేన గెలుచుకుంది.

ఇక దీనిపై ప‌వ‌న్ స్పందిస్తూ విజయం సాధించిన వారంద‌రికీ కూడా పార్టీ తరఫున శుభాకాంక్ష‌లు తెలిపారు.ఇక తాము అనుకున్నంత ఫ‌లితాలు రాక‌పోయినా కూడా పోటీ మాత్రం బాగానే ఇవ్వ‌గ‌లిగామ‌ని చెప్పారు.

Advertisement

ఇక ఈ స్థానిక సంస్థ‌ల ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయో తన‌కు తెలుస‌ని, వైసీపీ అదికారాన్ని దుర్వినియోగం చేసింద‌ని ఆరోపించారు.అందుకు సంబంధించిన సమాచారం ఉంద‌ని, ఇంకా పూర్తిగా స‌మాచారం వ‌చ్చిన త‌ర్వాత తాను మాట్లాడుతాన‌ని చెప్పారు.

రాబోయే మూడు రోజుల్లో తాను పూర్తి స్థాయిలో స్పందిస్తానని పేర్కొన్నారు.

ఇక వైసీపీ చేసిన అరాచ‌కాల గురించి కూడా త‌న దాగ్గ‌ర పూర్తి స్థాయిలో ఆధారాలు వ‌చ్చిన త‌ర్వాత అందరికీ వివ‌రాలు వెల్ల‌డిస్తానంటూ చెప్పారు.ఇక‌పోతే ఈ ఫలితాలు చూస్తే అస‌లు జనసేన ఆశించిన మేర లేక‌పోయినప్పటికీ కూడా పెద్ద‌గా అవమానకరమైన ప‌రిస్థితులు అయితే లేవ‌ని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే పెద్ద ఎత్తున ప్ర‌జాప్ర‌తినిధులు, ఆర్థిక స్థితిగ‌తులు లేక‌పోయినా కూడా ఈ స్థాయిలో అయినా పోటీ ఇవ్వ‌గ‌లిగింద‌ని ఆయ‌న వివ‌రించారు.

ఇక‌పోతే తాను ఎల్ల‌ప్పుడు కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని చెబుతున్నారు ప‌వ‌న్‌.మ‌రి ముందు ముందు ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుని పార్టీని న‌డిపిస్తారో చూడాలి.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు