మరో మూడు రోజుల్లో పదవీ విరమణ...కరోనా కు బలైన ఎఎస్పీ!

కరోనా మహమ్మారి కి దేశవ్యాప్తంగా పలువురు బలైపోతున్న విషయం తెలిసిందే.రోజు రోజుకు పెరుగుతున్న కేసులలో ఎక్కువగా కరోనా వారియర్స్ అంటే డాక్టర్లు,పోలీసులు ఉంటున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణా రాష్ట్రంలోని జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి కరోనా కారణంగా ఈ రోజు ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తుంది.వారం రోజులుగా ఆయన కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు.1989 బ్యాచ్‌కు చెందిన దక్షిణామూర్తి వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐ, డీఎస్పీగా పనిచేశారు.నక్సల్స్ ఆపరేషన్స్‌తో పాటు వరంగల్‌లో సంచలనం సృష్టించిన యాసిడ్‌ దాడి కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో కూడా ఆయన పాల్గొన్నారు.

Jagityala ASP Dead With Coronavirus, Jagityala ASP, Coronavirus, Dakshinamurthi,

దక్షిణామూర్తి ప్రస్తుతం జగిత్యాల అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.అయితే ఇటీవల ఆయనకు కరోనా సోకడం తో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మృతి చెందినట్లు తెలుస్తుంది.

కరీంనగర్‌లోని చల్మడ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమించి గుండెపోటు కూడా రావడం తో మృతి చెందినట్లు తెలుస్తుంది.ఎ ఎస్పీ కేడర్ లో ఉన్న ఒక ఉన్నతాధికారి ఇలా కరోనా తో మృతి చెందడం ఇదే తొలిసారి.

Advertisement

అయితే ఆయన మృతి తో డిపార్ట్ మెంట్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.ఎ ఎస్పీ దక్షిణామూర్తి స్వస్థలం కరీంనగర్ జిల్లాలోని అలుగునూరు కాగా,మరో మూడు రోజుల్లో పదవీ విరమణ చేయాల్సిన ఆయన ఇలా మృత్యు ఒడిలోకి చేరడం తో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ ఏడాది జరిగిన మేడారం జాతరకు స్పెషల్ ఆఫీసర్‌గా కూడా ఆయన్ను నియమించారు.అక్కడ ఆయన పనితీరుతో పలువురి నుంచి ప్రశంసలు కూడా పొందారు.ఈ క్రమంలో కోవిడ్ విధులు నిర్వహిస్తూ.

అనారోగ్యబారిన పడ్డారు.అతనికి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

నాగార్జున విషయంలో ఎందుకిలా జరుగుతుంది...
Advertisement

తాజా వార్తలు