పనిమనిషితో వంకర టింకర ఆమ్లెట్ అంటూ జగపతిబాబు రచ్చ.. వైరల్ వీడియో?

ఈమధ్య సీనియర్ నటీనటులు కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారారు.అంతేకాకుండా బాగా కాలక్షేపం చేస్తూ వీడియోలు పంచుకుంటున్నారు.

ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్ ఇలా మరి కొంతమంది సీనియర్ సెలబ్రెటీలు సోషల్ మీడియాలో బాగా హడావుడి చేస్తున్నారు.ఇక జగపతి బాబు కూడా ఈమధ్య మరింత రచ్చ చేస్తున్నాడు.

తాజాగా మరో వీడియోతో బాగా సందడి చేశాడు.ఇంతకు అసలు విషయం ఏంటో చూద్దాం.

జగపతిబాబు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న జగపతిబాబు టాలీవుడ్లో మంచి పేరు మంచి అభిమానం కూడా సొంతం చేసుకున్నాడు.

Advertisement
Jagapathi Babu Rant About Vankara Tinkara Omelet With The Maid Viral Video Jagap

మొదట్లో హీరోగా చేసిన జగపతిబాబు ఇప్పుడు నెగటివ్ పాత్రలలో కూడా కనిపిస్తున్నాడు.తొలిసారిగా 1992లో అసాధ్యులు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

తర్వాత గాయం, జాబిలమ్మ పెళ్లి, దొంగాట వంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి మంచి హిట్ లను సొంతం చేసుకున్నాడు.ఇక మధ్యలో సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చి మళ్లీ రీఎంట్రీ తో బాగా దూసుకుపోతున్నాడు జగపతిబాబు.

ఇక రీ ఎంట్రీ తో ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ తో అదరగొడుతున్నాడు.ఇక నెగిటివ్ పాత్రలలో కూడా జగపతిబాబుకి మంచి పేరు అందింది.

సహాయ పాత్రలలో కూడా కనిపిస్తున్నాడు జగపతిబాబు.ఈయన కెరీర్ మంచి పీక్ గా ఉన్న సమయంలో వ్యక్తిగతంగా వార్తల్లో కూడా నిలిచాడు.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?

కానీ అది ఆయన కెరీర్ కి ఎటువంటి మచ్చ తేలేదు.ఇక జగపతిబాబు ఈ వయసులో కూడా చాలా ఫీట్ గా, హ్యాండ్సమ్ గా ఉన్నాడు.

Jagapathi Babu Rant About Vankara Tinkara Omelet With The Maid Viral Video Jagap
Advertisement

ఇప్పుడు కూడా ఆయన ఎనర్జీ చూస్తే చాలామంది ఆశ్చర్యపోతున్నారు కూడా.ఈ మధ్య జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు.తనకు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకుంటూ ఉంటాడు.

తను చేసే విన్యాసాల వీడియోలను కూడా పంచుకుంటూ ఉంటాడు.అప్పుడప్పుడు తన కిచెన్ లో చేసే వంటకాలను కూడా చూపిస్తూ ఉంటాడు.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక వీడియో పంచుకున్నాడు.అందులో ఈసారి ఆయన ఆమ్లెట్ చేస్తూ కనిపించాడు.ఆయన పక్కనే ఇంట్లో పని చేసే ఆవిడ ఉండగా.

ఆమెకు చెబుతూ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూపిస్తూ కనిపించాడు.ఆ ఆమ్లెట్ ని స్వయంగా తానే చేయగా అది కాస్త వంకర టింకర కావడంతో దానికి వంకరటింకర ఆమ్లెట్ అంటూ ఓ పేరు కూడా పెట్టాడు జగపతిబాబు.

ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవటంతో అది చూసిన నెటిజన్స్ తెగ లైక్స్ కొడుతున్నారు.అంతేకాకుండా సరదాగా కామెంట్లు కూడా పెడుతున్నారు.

మీరు చేసిన ఆమ్లెట్ చూస్తే నోరు ఊరి పోతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక ఈయన ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉన్నాడు.

తాజా వార్తలు