కోట్లిచ్చినా కనికరం లేదు .. షర్మిలకు జగన్ లేఖ ? 

అన్నా చెల్లెళ్ళు అయినా వైసీపీ అధినేత జగన్,( YCP chief Jagan )  ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్  షర్మిల ( YS Sharmila )మధ్య ఆస్తుల వివాదం ఎప్పటి నుంచో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ విభేదాలు ఈ మధ్యకాలంలో రచ్చకెక్కడం,  ఈ వ్యవహారంలో జగన్,  ఆయన భార్య భారతీలు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో,  ఈ వ్యవహారం రాజకీయంగాను ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో లోనే జగన్ షర్మిల మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది .తాజాగా జగన్ షర్మిల మధ్య సరస్వతి పవర్ షేర్ల వివాదం జరుగుతోంది.ఈ వివాదం పైనే జగన్ కోర్టులో కేసు దాఖలు చేశారు.

తాజాగా ఈ వ్యవహారంపై జగన్ కు షర్మిల రాసిన లేఖను టిడిపి( TDP ) బయటపెట్టింది.ఇక ఆస్తి వివాదాల నేపథ్యంలో షర్మిలకు జగన్ లేఖ రాశారు.

Jagans Letter To Sharmila Has No Mercy Even If He Is Given Crores, Tdp, Ysrcp,

ఈ లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు జగన్.తనను రాజకీయంగా వ్యతిరేకించడంతో పాటుగా,  వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వ్యవహరించారని జగన్ లేఖ లో పేర్కొన్నారు.  బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేసావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Jagan's Letter To Sharmila Has No Mercy Even If He Is Given Crores, TDP, YSRCP,

అసత్యాలు చెప్పావని, షర్మిల చేసిన చర్యలు తనను బాధించాయని జగన్ తన లేఖలో వివరించారు.ఈ కారణంగానే సరస్వతి పవర్ కంపెనీలో గిఫ్ట్ డిడ్ కింద రాసిచ్చిన వాటాలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు.

నాన్న సంపాదించిన వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను ఆయన బతికున్న సమయంలోనే ఇద్దరికీ సమానంగా పంచారని జగన్ లేఖలో గుర్తు చేశారు .

Jagans Letter To Sharmila Has No Mercy Even If He Is Given Crores, Tdp, Ysrcp,

ఆ తర్వాత తన సొంత శ్రమ పెట్టుబడితో వ్యాపారాలు మొదలుపెట్టానని ,వాటికి వారసత్వంతో ఎలాంటి సంబంధం లేదని జగన్ పేర్కొన్నారు .ఎంతో ప్రేమ ఆప్యాయతతో కొన్ని ఆస్తులని షర్మిల పేరిట బదిలీ చేశానని జగన్ వివరించారు అమ్మ పేరిట కొన్ని షేర్లు రాసిచ్చానని వివరించారు.న్యాయపరమైన చిక్కులు తొలిగాక భవిష్యత్తులో ఆ ఆస్తులు షర్మిలకు చెందేలా ఒప్పందం చేసినట్లు గుర్తు చేశారు.

  అవి కాకుండా తన చెల్లికి నేరుగా అమ్మ ద్వారా గత దశాబ్ద కాలంగా 200 కోట్లు ఇచ్చానని షర్మిలకు రాసిన లేఖలో జగన్ వివరించారు.  ఇదంతా ప్రేమతోనే చేశానని , జగన్ లేఖ లో పేర్కొన్నారు .అయినా కనీస కృతజ్ఞత లేకుండా తనతో వ్యవహరించిందని జగన్ లేఖలో వ్యాఖ్యానించారు .తనకు వ్యతిరేకంగా అనేక చర్యలకు పాల్పడ్డ షర్మిలపై ప్రేమ ఆప్యాయత చూపాల్సిన అవసరం లేదని జగన్ పేర్కొన్నారు.  షర్మిల ఆలోచనలు,  ప్రవర్తనలో ఏమైనా సానుకూల మార్పులు వస్తే కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యాక ఆస్తులకు సంబంధించి ఏం చేయాలి ?  ఏం చేయకూడదు ?  ఎంత చేయాలనే అంశాలను తిరిగి పరిశీలిస్తానని లేఖలో జగన్ స్పష్టం చేశారు.ఈ లేఖ అంశాన్ని టిడిపి సోషల్ మీడియా వేదికగా బయటపెట్టి జగన్ ను టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేసింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు